సౌత్‌ కొరియన్‌ యువ సింగర్‌ మృతి.. విషాదంలో ఫ్యాన్స్‌!

10 Nov, 2023 18:15 IST|Sakshi

సౌత్‌ కొరియన్‌ యువ సింగర్‌, సాంగ్‌ రైటర్‌ లిమ్‌ నాహీ మృతి చెందారు. నాహీ (Nahee)గా పాపులర్‌ అయిన ఈ 24 ఏళ్ల గాయని బుధవారం(నవంబర్‌ 8) ఆకస్మికంగా మరణించినట్లు స్థానిక వార్తా సంస్థ కొరియాబూ వెల్లడించింది. అయితే నాహీ మరణానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. ఆమె కుటుంబ సభ్యులు కానీ, సంబంధిత అధికారులు కానీ ఇంతవరకూ వివరాలను వెల్లడించలేదు. నాహీ అంత్యక్రియలు గియాంగి ప్రావిన్స్‌లోని ప్యాంగ్‌టెక్‌ జరుగుతాయని కొరియాబూ వార్తా సంస్థ పేర్కొంది.

తమ అభిమాన సింగర్‌ ఆకస్మికంగా దూరమవడంతో ఆమె ఫ్యాన్స్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సంతాపం తెలియజేస్తూ కామెంట్లు వెల్లువెత్తాయి. మూడు రోజుల క్రితం నాహీ ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిసారిగా కొన్నిఫొటోలను అప్‌లోడ్‌ చేశారు. ఆమె మరణవార్త తెలిసిన ఫ్యాన్స్‌ తమ అభిమాన సింగర్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నాహీ చివరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ కింద కామెంట్లు పెట్టారు.

నాలుగేళ్లలోనే అత్యంత పాపులారిటీ
కొరియాబూ కథనం ప్రకారం.. నాహీ సౌత్‌ కొరియాలో అత్యంత ఆదరణ ఉన్న సింగర్‌. 2019లో ‘బ్లూ సిటీ’ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌తో అరంగేట్రం చేసిన లిమ్‌ నాహీ ఆ తర్వాత బ్లూ నైట్‌, గ్లూమీ డే వంటి పలు ఆల్బమ్స్‌ చేశారు. ‘హెచ్‌’, ‘రోజ్‌’ నాహీ చివరిసారిగా చేసిన ఆల్బమ్స్‌.

A post shared by 나히(Nahee) (@im_na._.hee)

మరిన్ని వార్తలు