మోదీకి క్వీన్ ఎలిజబెత్ విందు

13 Nov, 2015 19:11 IST|Sakshi
మోదీకి క్వీన్ ఎలిజబెత్ విందు

లండన్ : బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్వీన్ ఎలిజబెత్ అతిథి సత్కారం ఇచ్చారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోదీ గౌరవార్థం శుక్రవారం బకింగ్ హ్యామ్ ప్యాలెస్లో క్వీన్ ఎలిజబెత్..ఆయనకు విందు ఇచ్చారు. అనంతరం వెంబ్లే స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

 

ఈ సభకు సుమారు 60 వేల మందిపైగా ఎన్నారైలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున ఎన్నారైలు చేరుకున్నారు. అనంతరం మోదీ బ్రిటన్ ప్రధాని కామెరూన్ తో భేటీ అవుతారు. ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా మోదీ  ఉత్తర లండన్ లో అంబేద్కర్ మెమోరియల్ ను, 12వ శతాబ్దపు తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.

మరిన్ని వార్తలు