ఆ సీఎం "మాయగాడు"! అతని 'రెడ్‌ డైరీ'లో ప్రతీ పేజీ..

21 Nov, 2023 16:01 IST|Sakshi

ప్రధాని  నరేంద్ర మోదీ రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గెహ్లోత్‌ ఓ మాయాగాడు అంటూ ఫైర్‌ అయ్యారు. అతను రాష్ట్రంలో తుపాకులకే ఎక్కువ పనిచెప్పాడని విమర్శించారు. అతని రెడ్‌డైరి తన దగ్గరుందని అందులోని ప్రతి పేజీ గురించి చెబితే.. దెబ్బకు గెహ్లోత్‌ ముఖం మాడిపోవడం ఖాయం అని ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో బరాసన్‌ అంటాలో జరిగిన ప్రచారా ర్యాలీలో మోదీ ముఖ్యమంత్రి గెహ్లోత్‌పై ఈవిధమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రెడ్‌ డైరీలో..ఐదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో రాజస్తాన్‌లోని ప్రతి భూమి, నీరు, అడవి ఎలా అమ్ముపోయాయో అనే వివరాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్‌ తన దగ్గర ఉందన్నారు.

ముఖ్యంగా గెహ్లోత్‌ పాలనలో జరిగిన నేరారోపణలకు సంబంధించిన సమాచారం అంతా ఉందన్నారు . అందుకు సంబంధించిన విషయాలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా మోదీ జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశం గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సమావేశంలో అప్పటి రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ మహిళల భద్రతా అంశాన్ని లెవనెత్తారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన నేరాల విషయమై ఆత్మపరిశీలన చేసకోవాలని చురకలంటించారు. అంతే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే గెహ్లోత్‌ ప్రభుత్వం ఆయన్ను తొలగించిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆయన హాయాంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రస్తావించారు మోదీ.

కాంగ్రెస్‌ అంటే అవినీతి, రాజవంశం, బుజ్జగింపులకు చిహ్నం అంటూ ఎద్దేవా చేశారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యింది. ప్రస్తుతం మన ముందు అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దడమేనదే లక్ష్యం, కానీ రాజస్తాన్‌ అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చడమనే లక్ష్యం ఎలా సంపూర్ణమవుతుందన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కి చిహ్నం అయినా ఆ మూడే.. దేశానికి అతిపెద్ద శత్రువులని, అవి మన మధ్య ఉన్నంతవరకు అభివృద్ధి చెందిన భారత్‌గా ఎలా మార్చగలం అని నిలదీశారు.

ఇంకా మోదీ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీలోని ప్రతిఒక్కరూ సంయమనం లేనివారనని తిట్టిపోశారు. అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఒకేలా ప్రవర్తిస్తారని, ఈ విషయంలో ప్రజలు సైతం చిరాకుపడుతున్నారంటూ చివాట్లు పెట్టారు. కాగా, కరణ్‌పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్‌ సింగ్‌ కునార్‌ అకాల మరణంతో ఆ నియోజక వర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అందువల్ల 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్‌లో ప్రస్తుతం 199 స్థానాలకే అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ 99 సీటులు దక్కించుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుపొందింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టుకుని గెహ్లోత్‌ని సీఎంగా ప్రమాణం స్వీకారం చేయించింది . 

(చదవండి: అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకే ఎత్తుగడతో ఇరు పార్టీలు! ఏది హిట్‌ అవుతుందో?)

మరిన్ని వార్తలు