ట్రేడ్‌ వార్ : హువావే స్పందన

22 May, 2019 09:57 IST|Sakshi

చైనీస్‌ టెలికం దిగ్గజం హువే టెక్నాలజీస్‌పై విధించిన ఆంక్షలపై హువావే వ్యవస్థాపకుడు రెన్‌ జెంగ్‌ఫీ ధీటుగా స్పందించారు. తమ బలాన్ని అమెరికా ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తోందనీ, ఇది తగదని గట్టిగానే హెచ్చరించారు. ఇలాంటి చర్యల ద్వారా తమ సామర‍్ధ్యాలను ఏమాత్రం దెబ్బతీయలేరంటూ చైనీస్‌ స్టేట్‌ మీడియా సీసీటీవీతో పేర్కొన్నారు.

హువావేపై నిషేధం సడలింపు
హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలిస్తున్నట్లు ట్రంప్‌ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం  ఒక ప్రకటన  విడుదల చేసింది.

కాగా హువావేపై  అమెరికా గుర్రుగా ఉన్న  నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హార్డ్‌వేర్‌, ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా గత వారం హువేను వాషింగ్టన్‌ ప్రభుత్వం వాణిజ్యపరమైన(ట్రేడ్‌) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో గూగుల్‌ తదితర కంపెనీలు బిజినెస్‌ డీలింగ్స్‌ను రద్దుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా సడలిస్తూ వాషింగ్టన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి.

మరిన్ని వార్తలు