Sakshi News home page

చైనా కంపెనీ సీక్రెట్‌ ఆపరేషన్‌.. రహస్యంగా చిప్‌ల తయారీ!

Published Thu, Aug 24 2023 1:31 PM

Huawei is building secret network for chips trade group warns - Sakshi

అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్‌ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది.

ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్‌ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్‌ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్‌లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది.

భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్‌ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్‌ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ పేర్కొంది.

యూఎస్‌లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్‌ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు.

ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..

Advertisement

What’s your opinion

Advertisement