చైనాలో కొత్తగా ఒకే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు!

2 May, 2020 14:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)కు జన్మస్థానంగా భావిస్తున్న చైనాలో శనివారం నాటికి కొత్తగా ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 82875కు చేరగా.. 77,685 మంది కోలుకున్నారని జాతీయ ఆరోగ్య కమిషన్‌ పేర్కొంది. కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదని.. ఇప్పటివరకు 4,633 మంది వైరస్‌ బారిన పడి మృతిచెందారని తెలిపింది. ప్రస్తుతం నమోదైన ఒక కేసు కూడా లోకల్‌ ఇన్‌ఫెక్షన్‌ ద్వారా సోకింది కాదని స్పష్టం చేసింది. (నివురుగప్పిన నిప్పులా వుహాన్‌ )

ఇక కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన వుహాన్‌ నగరంలో గత 28 రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని హుబే ప్రావిన్స్‌ ఆరోగ్య కమిషన్‌ పేర్కొంది. ఈ విషయం గురంచి హుబే వైస్‌ గవర్నర్‌ మాంగ్‌ యున్యాన్‌ మాట్లాడుతూ... కఠిన నిబంధనలు అమలు చేసి కరోనాను కట్టడి చేయగలిగామని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కరోనా లక్షణాలు బయటపడని.. 20 మంది వ్యక్తులకు వైరస్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని వుహాన్‌లో పర్యటించిన ఓ అంతర్జాతీయ మీడియా బృందం పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా కరోనా సోకి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది.(తెరచుకున్న షాపులు.. ఇదంతా ప్రహసనం!)

మరిన్ని వార్తలు