ప్రతీకార చర్యలు.. మీడియాపై ఆంక్షలు

2 Dec, 2017 11:41 IST|Sakshi

మాస్కో : రష్యా దేశ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర విమర్శలు తావునిస్తోంది. పార్లమెంట్‌లోకి అమెరికా జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఓ తీర్మానాన్ని రూపొందించింది. 

పార్లమెంట్‌ దిగువ సభ డ్యుమాలో కవరేజ్‌ ప్రసారాల కోసం అమెరికన్‌ జర్నలిస్టులకు ప్రవేశం లేదని సభ నియంత్రణ కమిటీ అధ్యక్షుడు ఓల్గా సవత్స్యనోవా తెలిపారు. ఇది పూర్తిగా స్వతంత్ర్య నిర్ణయమేనని.. దీనిపై అధికారుల ఒత్తిడి ఏం లేదని ఆమె తెలిపారు. వచ్చేవారం ఈ తీర్మానాన్ని  సభ ఆమోదించనున్నట్లు ఆమె చెప్పారు. 

కాగా, ఇది ముమ్మాటికీ మీడియా హక్కులను కాలరాయటమేనని అమెరికా వాదిస్తుండగా.. తమ దేశానికి చెందిన ఆర్టీ నెట్‌ వర్క్‌ ఛానెల్‌ ప్రతినిధులను అమెరికన్‌ కాంగ్రెస్‌లోకి అనుమతించకపోవటానికి ప్రతీకార చర్యగానే రష్యా తాజా తీర్మానం ప్రవేశపెట్టినట్లు భావించవచ్చు. 

మరిన్ని వార్తలు