మర్కట ముని..

17 Jul, 2014 00:42 IST|Sakshi
మర్కట ముని..

ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మునిలా కనిపిస్తున్న ఈ మర్కటం ఫొటో అద్భుతం కదా.. ఇది ఇంత బాగుంది కాబట్టే.. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీలో వైల్డ్ స్టోరీస్ విభాగంలో విజేతగా నిలిచింది. జాస్పర్ అనే ఫొటోగ్రాఫర్ జపాన్‌లో ఈ మంచుకోతి చిత్రాన్ని తీశారు. అవార్డులు పొందిన ఇలాంటి అనేక చిత్రాలతో రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ లండన్‌లో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 17 వరకూ అది కొనసాగుతుంది.

 

మరిన్ని వార్తలు