నేను లెస్బియన్: మహిళా మంత్రి

27 Jun, 2016 18:52 IST|Sakshi
నేను లెస్బియన్: మహిళా మంత్రి

లండన్: బ్రిటన్ సీనియర్ మంత్రి జస్టిన్ గ్రీనింగ్స్ సంచలన ప్రకటన చేశారు. తాను స్వలింగ సంపర్కురాలినని వెల్లడించారు. కన్జర్వేటివ్ కేబినెట్ లో బహిరంగంగా 'లెస్బియన్' ప్రకటన చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. బ్రిటన్ ఐరోపా సమాఖ్యలోనే కొనసాగాలని ప్రచారం చేసిన ఆమె ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. లండన్ తో పాటు బ్రిటన్ వ్యాప్తంగా జరిగిన స్వలింగపర్కుల ర్యాలీలకు మద్దతు పలికారు. 'ఈరోజు ఎంతో మంచిరోజు. నేను స్వలింగ సంపర్కురాలినని చెప్పడానికి సంతోషిస్తున్నా. సంపర్కుల తరపున ప్రచారం చేస్తా. వారికి నా మద్దతు ఉంటుంద'ని పేర్కొన్నారు.

జస్టిన్ గ్రీనింగ్స్ చేసిన ప్రకటనను ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. హ్యారీ పోటర్ రచయిత్రి జేకే రౌలింగ్, యూకే ఛాన్సలర్ జార్జి అసబోర్నె తదితరులు అభినందనలు తెలిపారు. తాము స్వలింగ సంపర్కులమని బహిరంగంగా ప్రకటించిన హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల్లో 47 ఏళ్ల గ్రీనింగ్స్ 33వ వారు కావడం విశేషం. ప్రప్రంచ దేశాల్లో ఏ చట్టసభల్లోనూ ఇంతమంది 'గే'ల మని ప్రకటించుకోలేదు.

మరిన్ని వార్తలు