శ్రీలంక ప్రధానిగా రాజపక్స రాజీనామా

16 Dec, 2018 04:55 IST|Sakshi

కొలంబో: దాదాపు రెండు నెలలపాటు శ్రీలంకలో నెలకొన్న అస్థిర పరిస్థితులు తొలగిపోనున్నాయి. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించిన మహింద రాజపక్స ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ‘ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే సాధారణ ఎన్నికల్లోనూ సాధించడమే మా పార్టీ లక్ష్యం. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలగకుండా ఉండేందుకు, అధ్యక్షుడు సిరిసేన మరో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా రాజీనామా చేశాను’ అని రాజపక్స చెప్పారు. దీంతోపాటు అధ్యక్షుడు సిరిసేన మనసు మార్చుకున్నారు. సోమవారం 30మందితో కూడిన కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుందని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్‌పీ )వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు