పేదలకు కోట్ల ఇళ్లు కట్టించాను..

10 Nov, 2023 05:35 IST|Sakshi

ఛత్తర్‌పూర్‌/సత్నా/నీముచ్‌(మధ్యప్రదేశ్‌): దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచి్చందని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌ని ఒక్కో ఓటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి బలాన్నిచ్చేందుకు, అవినీతి కాంగ్రెస్‌ను మరో 100 ఏళ్లపాటు అధికారానికి దూరం ఉంచేందుకు ఉపయోగపడే ‘త్రిశక్తి’ వంటిందని పేర్కొన్నారు.

దేశాభివృద్ధిని వెనక్కి నడిపించడంలో కాంగ్రెస్‌కు మంచి నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే, అవినీతి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్, సత్నా, నీముచ్‌లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘మా ప్రభుత్వం దేశంలోని పేదలకు నాలుగు కోట్ల పక్కా గృహాలను నిర్మించి ఇచి్చంది. కానీ, నేను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను’అని ఆయన చెప్పారు.

‘వాహనం మనల్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్లినట్టుగానే కాంగ్రెస్‌ పారీ్టకి సుపరిపాలనను రివర్స్‌గేర్‌లో దుష్పరిపాలనగా మార్చడంలో నైపుణ్యం ఉంది. 100 ఏళ్ల క్రితమే గొప్ప నీటి వనరులున్న బుందేల్‌ఖండ్‌లో నీటి సమస్యలను తీర్చేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీంతో, ఇక్కడి ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. అందుకే, ఆ పారీ్టకి కనీసం 100 ఏళ్లపాటు అధికారం ఇవ్వరాదు. అప్పుడే అభివృద్ధి సాధ్యం’అని ప్రజలను కోరారు.

బానిస మనస్తత్వంతో కూడిన కాంగ్రెస్‌ దేశ అభివృద్ధిని పట్టించుకోలేదు, దేశ వారసత్వంతోనూ ఆ పారీ్టకి సంబంధం లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్‌కు ఒక పంజా ఉంది. పేదల వద్ద ఉన్న వాటిని గుంజుకోవడానికే దానిని వాడుతుంది. అలాంటి కాంగ్రెస్‌ పంజా బారి నుంచి మధ్యప్రదేశ్‌ను మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అంటూ ఆ పార్టీ ఎన్నికల గుర్తు హస్తంను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.  

నకిలీలను తొలగించాం
ప్రభుత్వ పథకాల ద్వారా పేదల ధనాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు లూటీ చేశాయని విమర్శించారు.కాంగ్రెస్‌ జమానాలో డబ్బంతా ఎక్కడికి చేరుతుందో ప్రజలకు అర్థమయ్యేది కాదు. 2జీ, కోల్, కామన్‌వెల్త్, హెలికాప్టర్ల కుంభకోణాల రూపంలో లక్షల కోట్లు దారి మళ్లాయి. వీటన్నిటినీ మోదీ ప్రభుత్వం ఆపు చేసింది. అప్పట్లో దళారులదే రాజ్యంగా ఉండేది. మోదీ ప్రభుత్వం వారి దుకాణాలను మూసివేయించింది.

అధికారంలోకి వచి్చన వెంటనే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సృష్టించిన దేశంలోని ప్రభుత్వ పథకాల 10 కోట్ల నకిలీ లబి్ధదారులను తొలగించి ప్రజాధనాన్ని కాపాడామన్నారు. పదేళ్ల కాలంలో రూ.33 లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదని పేర్కొన్నారు. కోవిడ్‌ సమయంలో పేదల పిల్లలు ఆకలితో అలమటించకుండా చేయగలగడం కేవలం మోదీ వల్ల కాదు, మీ అందరివల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఓటుతో ప్రజలిచి్చన అధికారం వల్లనే పేదల ఆకలి తీర్చగలిగినట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు