​సౌదీ అరేబియాలో ఆత్మాహుతి దాడి

4 Jul, 2016 08:25 IST|Sakshi

దుబాయ్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజును వారు హింసతోనే మొదలు పెడుతున్నారు. ఓర్లాండో.. ఇస్తాంబుల్.. ఢాకా.. బాగ్దాద్ తాజాగా సౌదీ అరేబియాపై పడ్డారు. జెడ్డాలోని అమెరికా విదేశాంగ కార్యాలయం సమీపంలో ఓ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

అతడిని నిలువరించే క్రమంలో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. కాగా, బాంబర్ మాత్రం తునాతునకలయ్యాడు. యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న మసీదు వైపుగా వెళుతూ అతడు ఈ ఘాతుకానికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న ఆస్పత్రిలోని వారు, కాన్సులేట్ కు చెందిన అధికారులంతా కొత్త ప్రాంతానికి తరలి వెళ్లినట్లు స్థానిక మీడియా వెళ్లడించింది. దీనిపై ప్రభుత్వం తరుపున అధికారులు మాత్రం ఇంకా స్పందించలేదు.

మరిన్ని వార్తలు