బ్లాక్ మనీ కేసు: ఐదుగురు భారతీయుల పేర్లు వెల్లడి

26 May, 2015 17:20 IST|Sakshi
బ్లాక్ మనీ కేసు: ఐదుగురు భారతీయుల పేర్లు వెల్లడి

న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతకు సంబంధించి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు స్విట్జర్లాండ్ సానుకూలంగా స్పందిస్తోంది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న ఐదుగురు భారతీయుల పేర్లను స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ప్రముఖ వ్యాపారవేత్త యాశ్ బిర్లా,  ముంబైకు చెందిన గుర్జిత్ సింగ్ కొచర్, ఢిల్లీకి చెందిన మహిళా పారిశ్రామిక వేత్త రికిత శర్మ ఉన్నారు. ఇంతకుముందు  స్నేహ్లతా సాహ్నే, సంగీతా సాహ్నేసయ్యద్ పేర్లను బహిర్గతం చేసింది. స్విట్జర్లాండ్ ఫెడరల్ గెజిట్లో వీరి పేర్లను బహిర్గతం చేసింది. వీరి ఖాతాలకు సంధించిన సమాచారాలను స్విస్ ప్రభుత్వం భారత్కు వివరాలు అందజేసింది.

విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు.. తాజా పరిణామం పెద్ద విజయమని భావిస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో 340 మంది భారతీయులకు ఖాతాలున్నట్టు సిట్ గుర్తించింది.

మరిన్ని వార్తలు