‘రాయల్‌’ సభ్యులుగా భారతీయ శాస్త్రవేత్తలు

7 May, 2017 01:29 IST|Sakshi

లండన్‌: ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉండే బ్రిటన్‌కు చెందిన రాయల్‌ సొసైటీలో ముగ్గురు భారత సంతతి శాస్త్రవేత్తలు సభ్యులుగా ఎన్నికయ్యారు.

కేంబ్రిడ్జ్‌ వర్సిటీకి చెందిన క్రిష్ణ చటర్జీ, న్యూయార్క్‌ వర్సిటీకి చెందిన సుభాష్‌ కోఠ్, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన యద్వీందర్‌ మల్హీలకు ఈ గౌరవం దక్కింది. అకాడమీ సభ్యులుగా 2017 సంవత్సరానికిగానూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన 50 మంది శాస్త్రవేత్తల బృందంలో వీరికి స్థానం లభించింది. భారతసంతతికి చెందిన రాయల్‌ సొసైటీ అధ్యక్షుడు, నోబెల్‌ ప్రైజ్‌ విజేత వెంకీ రామక్రిష్ణన్‌ శుక్రవారం తాజా బ్యాచ్‌కు స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు