వయసు పెంచే మాంసం

29 Apr, 2016 10:35 IST|Sakshi
వయసు పెంచే మాంసం

లండన్: ఆహారంలో మాంసం(బీఫ్ లేదా మటన్) అధికంగా ఉండి, పళ్లు, కూరగాయలు సరిపడినంతగా లేకపోవడం వయసు పెరిగినట్లు కనిపించేలా చేస్తుందని , అనారోగ్యానికి కారణమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. గ్లాస్గో విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దీన్ని చేపట్టారు. మాంసం వినియోగం  వల్ల సీరం ఫాస్పేటు స్థాయులు పెరిగి సాధారణం కన్నా ఎక్కువ వయసు వారిగా కనిపిస్తామని పరిశోధకులు గుర్తించారు. అధిక సీరం ఫాస్పేటు స్థాయులు మూత్ర పిండాల పనితీరుపై కూడా దుష్ర్పభావం చూపుతాయని కనుగొన్నారు. సంతులిత ఆహారం తీసుకునే వారిలో ఈ లక్షణాలు లేవని నిర్ధారించారు.

మరిన్ని వార్తలు