ప్రథమ మహిళ మేనల్లుళ్లు డ్రగ్స్ దొంగలే

19 Nov, 2016 09:53 IST|Sakshi
ప్రథమ మహిళ మేనల్లుళ్లు డ్రగ్స్ దొంగలే

న్యూయార్క్: వెనిజులా ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్ మేనల్లుళ్లు దోషులయ్యారు. అమెరికాకు మత్తు పదార్థాల రవాణా ఆరోపణల్లో వారు నేరం చేసినట్లుగా కోర్టులు ధృవీకరించాయి. న్యూయార్క్లోని ఫెడరల్ జ్యూరీ ఈ కేసును విచారిస్తూ వెనెజులా ప్రథమ మహిళ మేనళ్లులు ఈఫ్రెయిన్ ఆంటానియో ఫ్లోర్స్ (29), ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ఫ్రైతాస్ (30)ని దోషులుగా పేర్కొంది.

వీరి శిక్షా కాలాన్ని వచ్చే ఏడాది మార్చి 7న ప్రకటించనున్నారు. వీరిద్దరు వెనిజులా నుంచి దాదాపు 800 కేజీల కొకైన్ను హోండురాస్ నుంచి అమెరికాకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అమెరికాకు చెందిన డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేటివ్ (డీఈఏ) హైతీలో అరెస్టు చేసి న్యూయార్క్కు తరలించింది. అక్కడే నవంబర్ 7న విచారణ ప్రారంభించింది.

మరిన్ని వార్తలు