వాట్సాప్‌లో మరో బంపర్‌ ఫీచర్‌!

10 May, 2016 18:25 IST|Sakshi
వాట్సాప్‌లో మరో బంపర్‌ ఫీచర్‌!

వాట్సాప్‌ తన యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్కైప్‌, యాపిల్ ఫేస్‌టైమ్‌ వంటి పోటీ యాప్స్‌ ను తట్టుకొని నిలబడటానికి తాజాగా మరో ఫీచర్‌ను వాట్సాప్‌ యాడ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. తన  వినియోగదారులు వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించేందుకు వాట్సాప్‌ ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. డాటా కనెక్షన్‌ ఉపయోగించుకొని వినియోగదారులు ఫేస్ టు ఫేస్ వీడియో కాల్స్ చేసుకునేవిధంగా ఈ కొత్త ఫీచర్‌ ఉండనుంది.

'వీడియో కాల్స్‌'తో పాటు మరిన్ని మేజర్ ఫీచర్లను కూడా యాడ్ చేసేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. కాల్ బ్యాక్‌, వాయిస్ మెయిల్‌, జిప్ ఫైల్ షేరింట్ వంటివి సపోర్ట్ చేసేవిధంగా వాట్సాప్‌ను తీర్చిదిద్దుతోంది. ఆండ్రాయిడ్ పోలీసు వెబ్‌సైట్ కథనం ప్రకారం బెటా వెర్షన్ వాట్సాప్‌ వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. ఈ ఫీచర్‌ త్వరలోనే యాప్‌ కు చేర్చే అవకాశముందని, దీని స్క్రీన్‌ షాట్స్‌ను కూడా అది పోస్టు చేసింది.

నిజానికి గత ఏడాది డిసెంబర్ నుంచే వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్‌పై వదంతులు షికారు చేస్తున్నాయి. ఇదిగో వచ్చింది.. అదిగో వచ్చింది అంటూ దీని గురించి ఊరిస్తూ కథనాలు వచ్చాయి. ఇతర భాషల నుంచి అనువదించుకునే స్ట్రీంగ్స్‌ను వాట్సాప్‌ యాడ్ చేసిన తర్వాత వీడియో కాల్ వచ్చేసిందంటూ కొన్ని దేశాల్లో కథనాలు హల్‌ చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిస్ కాల్ ఫీచర్‌ ను జోడించిన వాట్సాప్‌ త్వరలోనే వీడియో కాల్‌ అవకాశాన్ని కూడా చేర్చవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు