వాట్సాప్‌ యూజర్లకు షాక్‌! 71.1 లక్షల అకౌంట్లపై నిషేధం

2 Nov, 2023 19:29 IST|Sakshi

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) గత సెప్టెంబర్‌ నెలలో భారత్‌కు చెందిన 71.1 లక్షల వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన తాజా ఇండియా నెలవారీ నివేదిక ప్రకారం.. వాట్సాప్ సెప్టెంబర్‌లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా 71.1 లక్షల ఖాతాలను నిషేధించింది.

2023 సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీల మధ్య 71,11,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ పేర్కొంది. వీటిలో 25,71,000 అకౌంట్లను వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా బ్యాన్‌  చేసినట్లు వివరించింది.

ఇదీ చదవండి: బిగ్‌ డీల్స్‌: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్‌ 5జీ ఫోన్‌లు! 

వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే ప్లాట్‌ఫామ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్‌ చేపట్టిన సొంత నివారణ చర్యలు తదితర వివరాలు ‘యూజర్‌ సేఫ్టీ రిపోర్ట్‌’లో ఉన్నాయి.

 

ఈ రిపోర్ట్‌ ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి 30 మధ్య గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ నుంచి వాట్సాప్‌కు ఆరు ఆర్డర్‌లు రాగా అన్నింటినీ పరిష్కరించింది.  కాగా వాట్సాప్ గత ఆగస్టులో 74 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో 35 లక్షల ఖాతాలను ముందస్తుగా బ్యాన్‌ చేసింది.

మరిన్ని వార్తలు