ఆ యుగం మళ్లీ వస్తుందా?

14 Jan, 2016 14:14 IST|Sakshi
ఆ యుగం మళ్లీ వస్తుందా?

సూర్యుడి ఉపరితలంలో సంభవించే ‘సౌరతుపానుల’నుంచి అపారమైన శక్తి విడుదలవుతుంది. ఈ తుపానుల సంఖ్య ఎప్పుడూ ఒకేలా ఉండదు, హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక్కోసారి కొన్ని వందల ఏళ్లపాటు సౌర తుపానులు తక్కువగా వస్తాయి. అలాంటి సందర్భాలలో సహజంగానే సూర్యుడి నుంచి భూమికి అందే సౌరశక్తి తగ్గుతుంది. ఆ సమయంలో భూగోళంలోని కొన్ని ప్రాంతాలలో ‘మంచు యుగాన్ని’ పోలిన వాతావరణం నెలకొంటుంది. అలాంటి దశనే ‘స్వల్పకాలిక మంచు యుగం’ అంటారు. సౌరతుపానుల్లో మార్పు కారణంగా క్రీ.శ 1300 -1850 మధ్యకాలంలో ఐరోపాలోను, ఉత్తర అమెరికాలోను ‘స్వల్ప’కాలిక మంచుయుగం’ పరిస్థితులు నెలకొన్నాయి.
 
 ముఖ్యంగా క్రీ.శ. 1645-1715 మధ్యకాలంలో ఆ ప్రాంతాల్లో మరింత చల్లటి వాతావరణం నెలకొంది. దీని ఫలితంగా గ్రీన్‌ల్యాండ్‌కి వెళ్లేదారులు మూసుకుపోగా, హాలండ్ వంటి కొన్ని దేశాల్లోని కాలువలు తరచూ గడ్డకట్టుకుపోయేవి.  ఆల్ఫ్ పర్వతాలలోని మంచునదులు అనేక గ్రామాలను చుట్టుముట్టి గడ్డకట్టుకుపోగా, సముద్రాలలోని మంచుపర్వతాల సంఖ్య పెరిగిపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా సౌర తుపానులను నిశితంగా గమనిస్తున్న శాస్త్రజ్ఞులు కొన్ని దశాబ్దాలకు అలాంటి స్వల్పకాలిక మంచుయుగం వచ్చే అవకాశం ఉందంటున్నారు.

>
మరిన్ని వార్తలు