37,490 మెగావాట్ల సోలార్‌పార్క్‌లు.. ఏయే రాష్ట్రాల్లో ఎంతంటే..

20 Dec, 2023 14:08 IST|Sakshi

దేశవ్యాప్తంగా పరిశ్రమలు, గృహావసరాలకు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కానీ అందుకు సరిపడా కరెంట్‌ తయారవడం లేదు. సంప్రదాయ విద్యుత్‌ ఉత్పత్తికి బదులుగా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను తయారుచేయాలని చాలాకాలంగా అవగాహన కల్పిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఈ ఏడాది నవంబర్ 30 వరకు 37,490 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 50 సోలార్ పార్కులకు ఆమోదం తెలిపినట్లు మంగళవారం పార్లమెంటులో వెల్లడింకచారు. ప్రభుత్వం 40 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌‌ల అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌‌కె సింగ్ పార్లమెంట్‌లో తెలిపారు. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ  మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ పథకం కింద నవంబర్ 30 నాటికి దేశంలోని 12 రాష్ట్రాల్లో 37,490 మెగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్కులను మంజూరు చేసినట్లు సింగ్ చెప్పారు. ఇప్పటికే 10,401 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 19 సోలార్ పార్కులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 

ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం?

రాష్ట్రాల వారీగా గుజరాత్‌‌లో సుమారు 12,150 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (8,276 మెగావాట్లు), ఆంధ్రప్రదేశ్ (4,200 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (4,180 మెగావాట్లు), ఉత్తర్‌ప్రదేశ్ (3,730 మెగావాట్లు), కర్ణాటకలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌పార్క్‌లు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు. జార్ఖండ్‌‌లో 1,089 మెగావాట్లు, మహారాష్ట్రలో 750 మెగావాట్లు, కేరళలో 155 మెగావాట్లు, ఛత్తీస్‌‌గఢ్‌‌లో 100 మెగావాట్లు, మిజోరాంలో 20 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు కూడా మంజూరైనట్లు వివరించారు.

>
మరిన్ని వార్తలు