11 మంది భర్తలు.. రాళ్లతో కొట్టి చంపారు..

10 May, 2018 15:36 IST|Sakshi
మహిళపై రాళ్లతో దాడి చేస్తున్న సోమాలియా మిలిటెంట్లు

మొగదిషు, సోమాలియా : సోమాలియాలో ఘోరం జరిగింది. 11 మందిని పెళ్లి చేసుకున్న ఓ మహిళను అల్‌ షబాబ్‌ మిలిటెంట్లు రాళ్లతో కొట్టి చంపారు. షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్‌ అనే మహిళ విడాకులు ఇవ్వకుండా 11 మందిని వివాహం చేసుకుంది.

సోమాలియా రాజధాని మొగదిషుకు చుట్టు పక్కల ప్రాంతాల్లో తరచూ రైడ్స్‌ నిర్వహించే అల్‌ షబాబ్‌ మిలిటెంట్లు ఈమెను పట్టుకున్నారు. విడాకులు ఇవ్వకుండా 11 మందిని పెళ్లి చేసుకున్నందుకు షరియా చట్టం ప్రకారం రాళ్లతో కొట్టిచంపాలని నిర్ణయించారు.

దీంతో ఆమెను గొంతు వరకూ భూమిలో పూడ్చి రాళ్లతో కొట్టి చంపారు. షుక్రికి ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. విచారణ సమయంలో మహిళ భర్తలను పిలిపించామని, ఆమె తన భార్య అంటే తన భార్య అని ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చారని అల్‌ షబాబ్‌ గవర్నర్‌ ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు