రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు వెలికితీత

4 Nov, 2014 06:10 IST|Sakshi

బెర్లిన్: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును జర్మనీలో కనుగొన్నారు.  బవేరియా రాష్ట్రంలోని రామర్స్డర్ఫ్ జిల్లాలో దీన్ని గుర్తించారు.  250 కిలోల బరువు గల ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

అధికారులు వెంటనే సమీప ప్రాంతం ప్రజలను అక్కడ నుంచి ఖాళీ  చేయించారు. దగ్గరలోని హైవేపై రాకపోకలను ఆపివేయించారు. నిపుణులు బాంబును నిర్వీర్యం చేసి తొలగించారు. రెండో ప్రపంచ యుద్ధం సయమంలో బాంబు దాడుల్లో మూనిచ్ నగరం చాలా వరకు దెబ్బతింది.
 

మరిన్ని వార్తలు