ఆ ప్రశ్నే నన్ను గుచ్చి గుచ్చి వేధిస్తోంది!

7 Oct, 2019 08:05 IST|Sakshi

నా దృష్టిలో అన్నిటి కంటే చాలా సులువైన పని ప్రేమలో పడటం. అన్నింటి కంటే కష్టమైన పని ఆ ప్రేమను గెలిపించుకోవడం. అంతకంటే కఠినం గెలుచుకున్న ఆ ప్రేమను కడవరకు నిలుపుకోవడం. చాలా తేలికగా ప్రేమించేసుకున్న మేము ఆ ప్రేమను గెలిపించుకోవడానికి మాత్రం యుద్ధమే చేసున్నాం. మమల్ని కన్నవారితో యుద్ధం, తోడ బుట్టిన అన్న, అక్కలతో యుద్ధం చివరికి ఏం చేయాలో తేల్చుకోలేక మాతో మేమే ఘర్షణ పడుతున్నాం. తికమక పడుతున్నాం. కానీ ఒకరికి తోడుగా మరొకరం కడదాక నిలవాలనుకుంటున్నాం. తీరం ఎటుందో తెలియకపోయినా ఒకరిచేయి పట్టుకొని మరొకరం నడవాలనుకుంటున్నాం.

నా పేరు శ్రీ హర్ష. అందరూ హర్ష అంటారు కానీ, ఆమె మాత్రం శ్రీ అని పిలుస్తుంది. తన పేరు మిధున​. అందమైన పేరు. తన పేరు లాగా తను కూడా చాలా అందంగా ఉంటుంది. అందంగా మాట్లాడుతుంది. అందంగా నవ్వుతుంది. అప్పుడుడప్పుడు అందంగా ఏడుస్తుంది కూడా. ఏమో తను ఏం చేసినా నాకు అందంగానే అనిపిస్తుంది. అందుకే ఇన్ని అందాలను వాడాను. నేను డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో జాయిన్‌ అయిన తొలిరోజే మిధునను చూశాను. పసుపు రంగు డ్రస్‌, ఎరుపు రంగు చున్ని వేసుకొని పద్దతికి చుడీదార్‌ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంతే ఆమెను చూడగానే ‘ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే’ అనిపించింది. క్లాస్‌లో అందరూ అందర్ని పరిచయం చేసుకుంటున్నారు.

నా కళ్లు మాత్రం తనని  చూస్తూ ఉండిపోయాయి. అలా మొదటిరోజు గడిచిపోయింది. నేను క్లాస్‌లో బాగా అల్లరి చేస్తూ యాక్టివ్‌గా ఉండేవాడ్ని. దాంతో అందరూ నాతో చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. నేను మాత్రం మిధున నాతో ఎప్పుడు మాట్లాడుతుందా.. అని ఎదురు చూసేవాడ్ని. అయితే ఒక రోజు మిధున నాతో మాట్లాడింది. ఆమె మాట్లాడటం అదే మొదటిసారి. కానీ, ఆ రోజు ఆమె చెప్పిన మాటలు విని తేరుకోవడానికి నాకు అరగంట పట్టింది. హర్ష నువ్వంటే నా కిష్టం నేనంటే నీకు చాలా ఇష్టం అని కూడా మీ ఫ్రెండ్స్‌ నాకు చెప్పారు. నువ్వు నాతో ఉంటే లైఫ్‌లాంగ్‌ హ్యాపిగా ఉంటాను అంది. ఆ మాటలు వినగానే నాకు ‘గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే’ అనిపించింది. అంతే హ్యాపీ డేసే అన్ని.

అప్పుడప్పుడు గొడవలు పడ్డా ఆ గొడవలు మా ప్రేమను ఇంకా పెంచాయే తప్ప తగ్గించలేదు. ఉదయం లేవగానే ఫోన్‌లో ఉన్న తన ఫోటో చూడటం, వాట్సాప్‌లో తన గుడ్‌ మార్నింగ్‌ బంగారం మేసేజ్‌తో డే స్టాట్‌ అయ్యేది. ఇలా కొన్ని రోజులు అయ్యాక మా కాలేజీ చదువు అయిపోయింది. ఉద్యోగం కోసం ఇద్దరం వేరువేరు ప్రాంతాలకు వెళ్లాం. చాలా కాలం దూరంగా ఉన్నాం. కానీ మా ప్రేమ మాత్రం అలానే ఉంది. కష్టపడితే ఇద్దరికి వేరు వేరు చోట్ల ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పేశాం.

అందరి తల్లిదండ్రుల్లాగానే నో అనే సమాధానమే వచ్చింది. ఇప్పటి వరకు తెలియని బాధ అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. ఎంత ప్రయత్నించినా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నాం. దీని వల్ల మా మధ్య కూడా గొడవలు అవుతున్నాయి. తను ఎక్కడ దూరం అయిపోతుందో అని భయంగా ఉంది. ఇంట్లో వాళ్లను ఎదిరించి ఒక్కటైతే రెండు మూడు సంవత్సరాల తరువాత అయినా మళ్లీ వస్తారు కలుస్తారు. అదే తనని నేను ఒక్కసారి కొల్పొతే మళ్లీ ఎప్పటికి తిరిగి రాదు. అందుకే ఇద్దరం ఇంకొన్ని నెలల్లో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మా ఆలోచన సరియైనదా కాదా అనే ప్రశ్న రోజు గుచ్చి గుచ్చి వేధిస్తోంది.
- శ్రీ హర్ష

మరిన్ని వార్తలు