నా మీద ఫీలింగ్స్‌ లేవంది.. ఓ రోజు..

17 Nov, 2019 16:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చిన్నప్పటినుంచి నాకు నా క్లాస్‌మేట్‌ వినూష అంటే చాలా ఇష్టం. తాను నేను కలిసి మా ఊరులో 1 నుండి 10th వరకు చదువుకున్నాం. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నాకు అసలు లెక్కల సబ్జెక్ట్ వచ్చేదేకాదు. తనే దగ్గరుండి నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేర్పించేది. నాతో చాలా బాగుండేది. అలా ఒక రోజు 9th క్లాస్‌లో ఉన్నపుడు తనకి ప్రపోజ్ చేశాను. తను రెస్పాండ్‌ కాలేదు. రెండు రోజుల తర్వాతి దాకా నాతో మాట్లాడలేదు. ‘నేనేమైనా ఆ అమ్మాయిని తప్పుగా అన్నాన’ అని అనిపించేది. ఒక రోజు తనే వచ్చి ఇలా అంది.. ‘సుబ్బు నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వలనే చేసుకుంటాను. నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నిన్ను ఒక ఫ్రెండుగానే చూశాను. ఇలానే ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్‌గా ఉందాం’ అంది. నేను సరే అన్నాను. అలానే 10th క్లాస్ పూర్తయింది. నేను డిప్లమా జాయిన్ అయ్యాను. తను చీరాలలో ఇంటర్ జాయిన్ అయ్యింది. మా మధ్య దూరం ఉన్నా డైలీ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. ఒక రోజు తను కాల్ చేసి ‘సుబ్బు మా అమ్మని ఒప్పించు ఇద్దరం పెళ్లి చేసుకుందాం’ అంది అప్పుడు చాలా సంతోషం వేసింది.

తను అలా అనగానే ఇక ఆలస్యం చేయకుండా మా అమ్మ నాన్నని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లాం. ఎంత సంతోషంగా వెళ్లానో తిరిగి అంత బాధతో వచ్చాను. ఎంత చెప్పినా వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు. అమ్మ ఒప్పుకోనిదే తను నన్ను పెళ్లి చేసుకోదు అని అర్థమైంది. ఆ రోజు నుంచి తనతో నేను మాట్లాడలేదు. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. తనకి పెళ్లయిందని తెలిసింది. తట్టుకోలేకపోయాను! ఒక మంచి అమ్మాయిని మిస్ అయ్యాననిపించింది. తాను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మిస్ యూ వినూష ఎప్పటికీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్.
- వి. సుబ్బు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పటికే నా లైఫ్‌లో వేరే వ్యక్తి ఉన్నాడు.. అందుకే..

అంతకంటే బ్రేకప్‌ చెప్పటం మేలు!

సారీ! మా ఇంట్లో మన ప్రేమ విషయం...

అతడిది బట్టతల.. అందమైన అమ్మాయి కావాలి

ప్రైవేట్‌ జాబ్‌ అయితే నాన్న ఒప్పుకోరు అంది

ఆ బాధ వర్ణనాతీతం

అతడ్ని మర్చిపోవడానికి పూజలు చేయించారు

ప్రేమ, గొడవలు పీక్స్‌కు వెళ్లిపోయాయి

ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!

మా పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారా?

మీ బంధం కలకాలం నిలబడాలంటే..

మాటలతో మనిషిని మార్చేసే టెక్నిక్ ఆమె సొంతం

ప్రేమికులను కలపటానికి ప్రతిభ తోడైతే..

తెలిసీ తెలియని వయసులో అలా చేశా..

ఆమె లేని లోటును పూడ్చలేకున్నా

తొలిప్రేమను దక్కించుకోవటానికి..

చచ్చేదాకా అతడితోనే లైఫ్‌ అన్నాను

ఆమె చేసిన మోసాన్ని లైఫ్‌లాంగ్‌ గుర్తుంచుకుంటా

అతడో ముక్కోపి.. అమ్మాయి కొట్టింది, ప్రేమ పుట్టింది

మీరు ఇంట్రావర్ట్‌లా? ఇది మీకోసమే.. 

నలుగురూ చూసి ఏమనుకుంటారో అని..

ఆమెకు పెళ్లైందని తెలిసి చనిపోవాలనుకున్నా..

ప్రేమ నిజంగా ఓ మత్తు మందు

అహం, అనుమానాలతో ప్రేమ నిలబడదు

వాడితో క్లోజ్‌గా ఉండకు, మంచోడు కాదు

నా మనసులో అతడి రూపం, ప్రేమ శాశ్వతం

ఆ మెసేజ్‌లే అంతా చెప్పేస్తాయి

ప్రేమకు మతం ఎన్నడూ అడ్డు కాదు!