ప్రేమంటే కాఫీ కబుర్లు, సినిమా థియేటర్లేనా..?

27 Nov, 2019 13:22 IST|Sakshi

అభి నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ఇద్దరం ఒకే స్కూళ్లో చదువుకున్నాం. మంచి ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. పాఠశాల నుంచి కాలేజీకి మారాకా మా మధ్య స్నేహం కన్నా ఇంకేదో ఉందని అర్థమయ్యింది. ఇంజనీరింగ్‌లో ఇద్దరికీ ఒకే కాలేజీ వస్తే చాలా బావుండు అనుకనేదాన్ని. కానీ ఇ‍ద్దరి ఎంసెట్‌ ర్యాంకుల్లో చాలా వ్యత్యాసం ఉండేసరికి మా కాలేజీలు వేరయ్యాయి. కానీ మా మధ్య ఫోన్‌ సంభాషణలు జరిగేవి. కాలేజీ, క్యాంటీన్‌, అసైన్‌మెంట్స్‌..ఇలా అన్నీ డిస్కస్‌ చేసేవాళ్లం. 

బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌లో అభి నాకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ఎగిరి గంత్తేయ్యాలనిపించింది. కానీ అమ్మాయిని  కదా అంత తొందరగా ఎలా పడతాను? కొన్ని రోజులు వెయిట్‌ చేయించా.పాపం అభి..నేను ఎలా రియాక్ట్‌ అవుతానేమోనని చాలా కంగారుపడ్డాడు. చెప్పాలంటే నేను అలా యాక్టింగ్‌ చేశానన్నమాట..కానీ అభిని ఇంకా బాధపెట్టడం ఇష్టం లేక మూడు నెలల తర్వాత తన ప్రేమను ఒప్పుకున్నాను. ఇక అప్పట్నుంచి మా ఆనందానికి అవుదుల్లేకుండా ఉండేవి. తనే నా లైఫ్‌ పార్టనర్‌ అని ఫిక్స్‌ అయ్యా.

చిన్నప్పటినుంచి తెలిసిన వ్యక్తి కావడంతో అభితో నాకు చనువెక్కువ. ప్రతీ విషయాన్ని తనతో పంచుకునేదాన్ని. అవసరమైనప్పుడు  సలహాలు, సూచనలు చేసేవాడు. రోజులు చాలా సరదాగా గడిచేవి. బీటెక్‌ మూడవ సంవత్సరం వచ్చేసరికి భవిష్యత్తుపై  బెంగ మొదలైంది. ఇద్దరి కులాలు వేరు అవడం వల్ల మా పెళ్లికి అమ్మానాన్న అస్సలు ఒప్పుకోరు. కానీ ఎలా అయినా ఒప్పించాలనే తాపత్రయం. దీనికి తోడు కాలేజీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. అభి వాళ్ల పేరంట్స్‌ కంటే మా అమ్మానాన్నలు చాలా రిస్ట్రిక‌్షన్స్‌ ఉండేవి.  మా వాళ్లకి కాస్ట్‌ ఫీలింగ్‌ చాలా ఎక్కువ. అప్పడు డిసైడ్‌ అయ్యాం...ఇకపై  ఫోన్‌ సంభాషణలు కూడా తగ్గించి ఫ్యూచర్‌పై  శ్రద్ద పెట్టాలని. కలిసి కబుర్లు చెప్పుకోవడం మానేశాం. ఫోన్లోనూ మాట్లాడుకోవడం తగ్గించాం. అప్పుడు అర్థమయ్యింది ఒకరికిఒకరం ఎంతలా అడిక్ట్‌ అయ్యామని. మొదట్లో చాలా కష్టమనిపించేది తనతో మాట్లాడకుండా, తనని చూడకుండా ఉండటం. కానీ లైఫ్‌లో కొన్ని సాధించాలి అంటే, ఇంకొన్నింటిని వదులుకోవాలి, కొన్ని పరిమితులు ఉంచాలని నిర్ణయించుకున్నాం.

అప్పటినుంచి మా ఫోకస్‌ అంతా స్టడీస్‌పైనే ఉండేది. తన లైఫ్‌ ఆంబీషన్‌ ఐపీఎస్‌ అధికారి అవ్వడం. నాకేమో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవ్వాలనుంది. అలా సంవత్సరం గడిచింది. మేము దూరంగా ఉన్నా మా మనసుల మధ్య ఇసుమంతైనా దూరం పెరగలేదు. అయినా స్వచ్ఛమైన ప్రేమంటే కాఫీ కబుర్లు, సినిమా థియేటర్లేనా..? అందుకే సంవత్సరం దూరంగా ఉన్నా మా మధ్య బంధం అలానే ఉంది. అలానే ఉంటుంది కూడా. అభి, నేను లైఫ్‌లో సెటిల్‌ అయ్యి మా పేరేంట్స్‌ని ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుంది. మా ప్రేమను వారు అంగీకరించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నా. 

     -కీర్తన (పేర్లు మార్చాం)

మరిన్ని వార్తలు