ఇలాంటి పార్ట్‌నర్‌ దొరకటం వరం!

5 Dec, 2019 11:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కష్టసుఖాల్లో మన వెంటే నీడలా ఉండే పార్ట్‌నర్‌ దొరకటం నిజంగా ఒక వరం. బాధల్లో ఉన్నపుడు మన గురించి ఆలోచించే భాగస్వామి చేయూత మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వారి మాటలు బాధనుంచి కోలుకునే శక్తినిస్తాయి. మన మనసును అర్థం చేసుకునే పార్ట్‌నర్‌తో జీవితాన్ని పంచుకోవటం ఎంతో ప్రత్యేకమైనది. మంచి లక్షణాలు కలిగిన భాగస్వామి దొరకటం చాలా కష్టం. అయితే కొంతమంది పుట్టుకతోటే కొన్ని మంచి లక్షణాలు కలిగి ఉంటారు. అలాంటి వారు తమ పార్ట్‌నర్‌ను కంటికి రెప్పలా సంరక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ క్రింది నాలుగు రాశులకు చెందిన వారు తమ భాగస్వామి పట్ల ఎక్కువ కేరింగ్‌గా ఉంటారు.

1) మేషం : ఈ రాశి వారు నిజాయితీ కలిగిన వ్యక్తిత్వానికి పెట్టింది పేరు. వీరితో జీవితం పంచుకోవటం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. భాగస్వామి అవసరాలు తీర్చటానికి తమ అవసరాలను బలిపెట్టడానికి కూడా వెనుకాడరు. ఎదుటి వారి కోసం తమ జీవితాలను పణంగా పెడతారు.

2) కర్కాటకం : వీరు తమ పార్ట్‌నర్‌ అడిగిన దాన్ని కాదనుకుండా చేసే గుణం కలవారు. కష్టసమయాల్లో ఎదుటి వ్యక్తికి ఎంతో తోడుగా ఉంటారు. భాగస్వామిని చిన్నపిల్లల్లాగా చూసుకుంటారు. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా తోడుంటారు. ఎదుటి వ్యక్తి కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తారు. 

3) సింహం​ : ఈ రాశుల వారు ప్రేమలో పడనంత వరకు ఒకలా ఉంటారు. ప్రేమలో పడిన తర్వాత సింహంలాగా తమ భాగస్వామి సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఎల్లప్పుడూ తమ పార్ట్‌నర్‌ను సంరక్షిస్తూ ఉంటారు.

4) వృశ్చికం : ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమ అతి ప్రేమగా మారిపోతుంది. వీరి స్వభావాల కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు ఈర్శ్య కలిగిన ప్రేమికులుగా కనిపిస్తుంటారు. ఎదుటి వ్యక్తిని సంరక్షించాలనే తపనే వారిలో ఈర్శ్య కలిగేలా చేస్తుంది. పార్ట్‌నర్‌ను సంరక్షించటానికి ఎంతో కృషి చేస్తారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు