ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!

8 Nov, 2019 11:56 IST|Sakshi

మేషం : మీ ప్రేమ ప్రతిపాదనలు, అభిప్రాయాలు వెల్లడించేందుకు మంగళ, బుధవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీరు ఇష్టపడే వారి నుంచి సైతం సానుకూల సందేశాలు అందవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ప్రపోజ్‌ చేయటానికి వెళుతున్న సమయంలో క్రీమ్, గ్రీన్‌ కలర్‌ దుస్తులు ధరించండి.  ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టేటప్పుడు పశ్చిమవాయువ్యం దిశగా ఇంటి నుంచి కదలండి.

వృషభం : వీరికి బుధ, శుక్రవారాలు విశేషమైన రోజులుగా చెప్పవచ్చు. ప్రేమ సందేశాలు అందించేందుకు, స్వీకరించేందుకు అనువైన కాలం. మీరు ప్రేమించే వ్యక్తి నుంచి సైతం ఉత్సాహవంతమైన సందేశాలు అందవచ్చు. మనోధైర్యంతో అడుగేయండి. వైట్, ఎల్లో కలర్‌ దుస్తులు ధరించి ప్రేమ ప్రతిపాదనలు చేయండి.  ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టేటప్పుడు ఉత్తరదిశగా ఇంటి నుంచి బయలుదేరండి అనుకూలత ఉంటుంది.

మిథునం : బుధ, గురువారాలు ప్రేమ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలకు ఆవతలి వ్యక్తుల నుంచి సానుకూలత వ్యక్తం కావచ్చు.  దృఢ సంకల్పంతో ముందుకు సాగండి విజయం సాధిస్తారు. ఎరుపు, చాక్లెట్‌ రంగు దుస్తులు ధరించి మీ ప్రేమను వెల్లడించండి. ప్రపోజ్‌ చేయటానికి వెళ్లేటప్పుడు తూర్పుదిశగా ఇంటి నుంచి కదలండి, శుభసందేశాలు అందుకుంటారు.

కర్కాటకం : సోమ, మంగళవారాలు మీ ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు తగిన సమయం. ఈ కాలంలో ఆవతలి వ్యక్తులనుంచి వ్యతిరేకత తగ్గి సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కొంత సహనంతో సాగితే విజయాలు సాధిస్తారు. మీ అభిప్రాయాలను వెల్లడించే సమయంలో వైట్, రెడ్‌ రంగు దుస్తులు ధరించి ప్రయత్నించండి. ఇక ఇటువంటి ప్రయత్నాలకు ఇంటి నుంచి దక్షిణ దిశగా అడుగులు వేయండి.

సింహం : మీ అభిప్రాయాలు ఇష్టమైన వ్యక్తులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు అనుకూలమైనవి. ఈ సమయంలో మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తే ఆవతలి నుంచి కూడా తగిన ప్రతిస్పందన వచ్చే సూచనలు. ప్రేమ ప్రయత్నాలకు వెళ్లే సమయంలో ఆరెంజ్, క్రీమ్‌ రంగు దుస్తులు ధరించండి. ప్రపోజ్‌ చేయటానికి వెళ్లేటప్పుడు పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి, మంచి జరుగుతుంది.

కన్య : శుక్ర, శనివారాలు వీరికి అన్ని విధాలా అనుకూల సమయం. ప్రియమైన వ్యక్తులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే, అవతలి నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావచ్చు. ఇటువంటి ప్రయత్నాల సమయంలో చాక్లెట్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. ప్రేమ ప్రతిపాదనలు చేసేటప్పుడు ఉత్తరదిశగా ఇంటి నుంచి బయలుదేరితే మరింత సానుకూలత ఉండవచ్చు.

తుల : మీ అభిప్రాయాల వెల్లడికి ఆది, సోమవారాలు అనువైనవి. ఈ రోజులలో చేసే ప్రేమ ప్రయత్నాలు విజయవంతంగా సాగే అవకాశాలుంటాయి. ఇదే సమయంలో మీరు ఇష్టపడే వ్యక్తుల నుంచి మీ ఊహలు నిజయయ్యే సందేశాలు అందవచ్చు. ప్రేమ ప్రయత్నాలు చేసే సమయంలో వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరించండి. ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టే సమయంలో ఈశాన్యదిశగా అడుగేయండి, శుభకరంగా ఉంటుంది.

వృశ్చికం : వీరికి సోమ, మంగళవారాలు ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన రోజులు. ఈ సమయంలో మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ మనోభావాలను వెల్లడించేందుకు శుభకరం. అలాగే, మీరు అనుకున్న వ్యక్తుల నుంచి సైతం సానుకూలత వ్యక్తం కావచ్చు. ఈ ప్రయత్నాల సమయంలో ఆరెంజ్, క్రీమ్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, దక్షిణ ఆగ్నేయదిశగా కదలండి, విజయాలు సొంతం చేసుకుంటారు.

ధనుస్సు : బుధ, గురువారాలు మీ మనస్సులోని భావాలను ఇష్టులకు వెల్లడించేందుకు అనుకూల రోజులు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అలాగే, ఈ రోజుల్లో అవతలి వ్యక్తుల నుంచి సానుకూలత వ్యక్తం కావచ్చు. ప్రేమ ప్రయత్నాలు చేసే సమయంలో గ్రీన్, బ్లూ రంగు దుస్తులు ధరించండి. ప్రపోజ్‌ చేయటానికి వెళుతుంటే ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా కదలండి.

మకరం : మీ అభిప్రాయాలను ఇష్టులకు వెల్లడించేందుకు, వివాహ ప్రతిపాదనలకు శుక్ర, శనివారాలు సానుకూలమైనవి. ఈ రోజులలో మీ ప్రతిపాదనలకు ఆవతలి వ్యక్తుల నుంచి సానుకూలమైన సందేశాలు అందవచ్చు. ఈ ప్రయత్నాల సమయంలో వైట్, గ్రీన్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, దక్షిణదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. 

కుంభం : మంగళ, బుధవారాలు మీ ప్రేమ సందేశాలను ఇష్టమైన వారికి అందించేందుకు తగిన సమయం. అలాగే, మీరు ఊహించిన సమాచారాలు సైతం ఆవతలివారి నుంచి అందవచ్చు. ప్రపోజ్‌ చేయటానికి వెళుతున్న సమయంలో ఎల్లో, పింక్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, పశ్చిమవాయువ్య దిశగా ఇంటి నుంచి బయలుదేరండి, విజయాలు సొంతం కాగల అవకాశాలుంటాయి.

మీనం : మీ ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు ఆది, సోమవారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ సందేశాలకు ఆవతలి నుంచి కూడా అనుకూల స్పందన రావచ్చు.  ప్రేమ ప్రయత్నాలు చేసే సమయంలో క్రీమ్, పింక్‌ రంగు దుస్తులు ధరించండి. ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టేటప్పుడు తూర్పు దిశగా ఇంటి నుంచి కదలండి, అనుకున్న లక్ష్యాలు సాధించడం సులభతరం కావచ్చు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు