ఆ వేడుక క్లైమాక్స్ కు స్వరమాంత్రికుడు

17 Nov, 2015 18:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్కార్ అవార్డు విజేత, స్వర మాంత్రికుడు ఏఆర్ రహ్మాన్ భారత అంతర్జాతీయ చిత్రోత్సవ వేడుక(ఇఫ్పి)కు హాజరుకానున్నారు. ఈ నెల 20న ప్రారంభంకానున్న ఈ చిత్రోత్సవ ముగింపు సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి హాజరుకానున్నారు.

గోవా ప్రభుత్వం, గోవా ఎంటర్ టైన్ మెంట్ సొసైటీ మంగళవారం నిర్వహించిన సమీక్ష కార్యక్రమం అనంతరం ఈ ప్రకటన విడుదల చేశాడు. ఈ చిత్రోత్సవ వేడుకలో దాదాపు 89 దేశాలకు చెందిన 187 చిత్రాలు ప్రదర్శనకోసం కొలువుదీరనున్నాయి. వీటిలో భారత్ చెందిన 47 ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. అయితే, స్పెయిన్ మాత్రం ఈసారి తన చిత్రాల హవాను ఈ వేడుకలో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఈ వేడుక జరగనుంది.