నేనూ బాధితురాలినే

2 Nov, 2018 05:38 IST|Sakshi
పార్వతి

‘మీటూ’ ఉద్యమం వల్ల చాలామంది స్త్రీలు తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. మరికొందరు తమను వేధించిన వాళ్ల పేర్లను కూడా బయటపెడుతున్నారు. తాజాగా మలయాళ నటి పార్వతి ఈ విషయం గురించి మాట్లాడారు. ‘నేనూ ఓ బాధితురాలినే అంటూ తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. ‘‘ఈ సంఘటన నాకు నాలుగేళ్ల వయసులో జరిగింది. అది తప్పు అని తెలుసుకోవడానికి నాకు సుమారు 17ఏళ్లు పట్టింది.

మళ్లీ దాని గురించి మాట్లాడటానికి మరో పదేళ్లు పట్టింది. ఆ సంఘటన నుంచి బయటపడాలని అనుకుంటుంటాను. కానీ ఒక్కసారి ఇలాంటి లైంగిక దాడి జరిగిన తర్వాత మళ్లీ మనం మామూలుగా ఉండలేం. గతం తాలూకు ఆ ఆలోచనలు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. నా పేరెంట్స్, స్నేహితులు మెల్లిగా నా స్థితికి అలవాటు పడుతున్నారు. బాధితురాలిగా ఉండటం కేవలం శారీరక గాయంగా మాత్రమే చూడొద్దు. ప్రతిరోజూ పడే మానసిక క్షోభ అది. దాన్ని దాటుకొని బయటకు రావాలంటే ఎంతో మానసిక ధైర్యం కావాలి’’ అని పేర్కొన్నారు పార్వతి.

మరిన్ని వార్తలు