బీజేపీలోకి శుభసంకల్పం నటి..!

26 Jul, 2019 07:21 IST|Sakshi

తమిళనాడు, పెరంబూరు: ఇవాళ సినిమా వాళ్లు రాజకీయాల్లోకి.. రాజకీయనాయకులు సినిమాలోకి రావడం సర్వ సాధారణంగా మారింది. సినిమా వాళ్ల నెక్ట్స్‌ స్టెఫ్‌ రాజకీయాలుగా ఉంటే, రాజకీయాల్లోని సీనియర్లు సినిమాలవైపు చూస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా నటి ప్రియారామన్‌ రాజకీయరంగప్రవేశం ఖరారైంది. ఈమె బీజేపీ తీర్థం పుచ్చుకోనుంది. మలయాళీ భామ అయిన ప్రియారామన్‌ నటుడు రజనీకాంత్‌ కథను సమకూర్చి నటించిన ‘వళ్లి’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ప్రవేశించింది.

తొలి చిత్రంలోనే బలమైన పాత్ర లభించడం, అదీ రజినీకాంత్‌ వంటి స్టార్‌ హీరోతో కలిసి నటించడంతో మంచి ప్రాచుర్యం లభించింది.  తరువాత సూర్యవంశం తదితర చిత్రాల్లో నటించిన ప్రియారామన్‌ టాలీవుడ్‌లోనూ నటిగా పరిచయం అయ్యారు. కే.విశ్వనాధ్‌ దర్శకత్వం వహించిన శుభసంకల్పం చిత్రంలో కమల్‌హాసన్‌తో కలిసి నటించింది. మరి కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించింది. కాగా నేశం పుదుసు అనే చిత్రంలో నటుడు రంజిత్‌తో కలిసి నటించిన ప్రియారామన్‌ ఆయన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థలతో 2014లో విడిపోయి విడాకులు తీసుకున్నారు. నటనకు గ్యాప్‌ ఇచ్చిన నటి ప్రియారామన్‌ ఇటీవల మళ్లీ బుల్లితెరలో నటించడంతో పాటు, టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె రాజకీయరంగప్రవేశం చేయడానికి సిద్ధమయ్యారు. బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి లైన్‌ క్లియర్‌ అయ్యిందని ఆమె ఒక భేటీలో పేర్కొన్నారు. ప్రియరామన్‌ ఆంధ్రాకు చెందిన బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందని, త్వరలోనే ఆమె ఆ పార్టీలో చేరే విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రియారామన్‌ మాజీ భర్త రంజిత్‌ కూడా ఆ మధ్య తమిళనాడులోని బీజేపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధిష్టానంపై ఏర్పడ్డ అసంతృప్తి కారణంగా బయటకు వచ్చి ఆ తరువాత డీఎంకేలో చేరారన్నది గమనార్హం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌

సమంతలా నటించలేకపోయేదాన్నేమో!

లుంగీ కడతారా?

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు : వరుణ్‌ సందేశ్‌

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌

పటాస్‌లోని రాములమ్మ బిగ్‌బాస్‌లోకి

మహేష్‌.. ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌

పసుపు-కుంకుమ స్టార్‌.. అలీ రెజా

బిగ్‌బాస్‌లో ‘జండూభామ్‌’

మాస్‌ స్టెప్పులకు మారుపేరు బాబా భాస్కర్‌

ప్రత్యేకమైన యాసతో అదరగొట్టే రోహిణి

పెద్దపులి పాట.. రాహుల్‌ నోట

బిగ్‌బాస్‌లో.. హీరోయిన్స్‌ ఫ్రెండ్‌

ప్రశ్నలతో తికమట్టే జాఫర్‌

సోషల్‌ మీడియా టూ టాలీవుడ్‌.. టాలీవుడ్‌ టూ బిగ్‌బాస్‌

‘సాహో’ కొత్త యాక్షన్‌ పోస్టర్‌

రవికృష్ణ.. సీరియల్‌ హీరోకు కేరాఫ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో