తను చాలా నచ్చింది!

29 Nov, 2018 03:19 IST|Sakshi
ప్రభుదేవా

‘ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌’... ప్రభుదేవాని అభిమానులు ముద్దుగా ఇలానే పిలుచుకుంటారు. తన డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు హీరోల చేత కూడా తనదైన శైలిలో స్టెప్పులేయించి, ప్రేక్షకులు, అభిమానుల చేత ఈలకొట్టించి గోల చేయించగలరు. ప్రభుదేవా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే సంగతి తెలిసిందే. డ్యాన్స్‌ మాస్టర్‌గా, యాక్టర్‌గా, డైరెక్టర్‌గా అందరికీ సుపరిచితులే. తాజాగా పాటల రచయితగా మరో అవతారం ఎత్తారాయన.

ప్రభుదేవా, నిక్కీగల్రానీ, అదా శర్మ ముఖ్య తారలుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చార్లీ చాప్లిన్‌ 2’. 2002లో విడుదలై ఘన విజయం సాధించిన ‘చార్లీ చాప్లిన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ‘ఇవళ ఇవళ రొంబ పిడిచిరుక్కు...’ (తను తను చాలా నచ్చింది) అనే పాటను ప్రభుదేవా రాశారు. ఈ పాటకి అమ్రిష్‌ చక్కని స్వరాలు అందించారు. హీరోగా మారిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ పాటని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం..  ప్రభుదేవా రాసిన తొలి పాట వినేస్తే పోలా!

మరిన్ని వార్తలు