'జెజ్బా' మూవీ రివ్యూ

9 Oct, 2015 13:39 IST|Sakshi
'జెజ్బా' మూవీ రివ్యూ

టైటిల్ : జెజ్బా
జానర్ ;  థ్రిల్లర్ యాక్షన్ డ్రామా
తారాగణం ; ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్,  షబానా అజ్మీ, జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణీ
దర్శకత్వం ; సంజయ్ గుప్తా
సంగీతం ; సచిన్ జిగార్
నేపథ్య సంగీతం ; అమర్ మొహిలే
నిర్మాత ; వైట్ ఫెదర్ ఫిలింస్, వీకింగ్స్ మీడియా & ఎంటర్టైన్మెంట్


ఐదేళ్ల విరామం తరువాత ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ సినిమాగా విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది జెజ్బా. 2007లో రిలీజ్ అయిన సౌత కొరియన్ ఫిలిం 'సెవెన్డేస్' ఆధారంగా ఈ సినిమాకు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ నేటివిటికి తగ్గట్టుగా అన్ని రకాల మార్పులతో థ్రిల్లింగ్ స్క్రీన్ప్లే తో తెరకెక్కిన  జెజ్బా  ఆడియన్స్ ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ :
ముంబైలో లీడింగ్ క్రిమినల్ లాయర్ అయిన అనురాధ వర్మ (ఐశ్వర్యరాయ్) పరిచయంతో సినిమా మొదలవుతుంది. తన కెరీర్లో వంద శాతం సక్సెస్లతో నెంబర్ వన్ లాయర్ అనిపించుకుటుంది. భర్త నుంచి విడాకులు తీసుకొని విడిగా ఉంటున్న అనురాధ తన కూతురు సాన్యా (సారా అర్జున్) ఆలనాపాలనా కూడా తనే చూసుకుంటుంది. కూతురు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంటుంది. ఒకరోజు స్కూల్లో ఆటల పోటీలు జరుగుతున్న సందర్భంలో సాన్యా కిడ్నాప్ అవుతుంది.

 

అయితే కిడ్నాపర్స్ డబ్బులు అడగటానికి బదులు జైలులో ఉన్న నవాజ్ తరపున కేసు వాదించాల్సిందిగా డిమాండ్ చేస్తారు. సియా(ప్రియాబెనర్జీ) అనే అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిన నేరం మీద నవాజ్ జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఇక చేసేదేమిలేక నవాజ్ తరపున కేసు వాదించటానికి అంగీకరిస్తుంది అనురాధ. అదే సమయంలో అనురాధ స్నేహితుడు,  సస్పెండ్ అయిన పోలీస్ అధికారి యోహన్( ఇర్ఫాన్ ఖాన్) ఆమెకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఈ ఇద్దరు కిడ్నాపర్స్ నుంచి సాన్యాను ఎలా బయటికి తీసుకువచ్చారు అన్నదే మిగతా కథ.

నటీనటులు :
రీ ఎంట్రీ లో ఐశ్వర్యరాయ్ తన వయసుకు తగ్గ కథను ఎంచుకుంది. నటిగా తనలో ఏ మాత్రం పట్టు తగ్గలేదని ఈ సినిమాతో నిరూపించుకుంది.  కూతురు కిడ్నాప్ అయిన తరువాత బలవంతంగా ఓ కేసు వాదిస్తున్న లాయర్గా అండర్ కరెంట్ ఎమోషన్స్ను అద్భుతంగా పండించింది. లాయర్ అనురాధకు సాయం చేసే పాత్రలో ఇర్ఫాన్ ఖాన్ మెప్పించాడు. కొన్ని సీన్స్లో ఇర్ఫాన్ నటన ఆ పాత్రకు తనే అల్టిమేట్ చాయిస్ అనిపించేలా ఉంది. ఇక హత్యకు గురైన యువతి తల్లిగా షబానా అజ్మీ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఐశ్వర్యతో పోటీపడి నటించిన షబానా తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నటించిన జాకీ ష్రాఫ్, సారా అర్జున్, అతుల్ కులకర్ణీ, సిద్ధాంత్ కపూర్ తన పాత్ర పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం సంజయ్ గుప్తా స్క్రీన్ ప్లే. క్రైం థ్రిల్లర్లను తెరకెక్కించటంలో మంచి అనుభవం ఉన్న సంజయ్ మరోసారి ఆ జానర్లో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాలు అభిమానులను రెప్పవేయకుండా చూసేలా చేస్తాయి. ప్రథమార్థం చివరలో సినిమా కాస్త స్లో అయినట్టుగా అనిపించినా సెకండాఫ్ మాత్రం అద్భుతంగా వచ్చింది. సినిమాకు ప్రాణం పోసిన మరో సాంకేతిక నిపుణుడు డైలాగ్ రైటర్ కమలేష్ పాండే. ఎమోషనల్ సీన్స్తో పాటు కోర్ట్ సీన్స్లోనూ కమలేష్ డైలాగ్స్ చాలా బాగా పేలాయి. ఆడియో పరంగా ఆకట్టుకోకపోయినా అమర్ మొహిలే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన రేంజ్ లో పండించాడు.  సమీర్ ఆర్య సినిమాటోగ్రఫి ఆశించిన స్థాయిలో మెప్పించింది.

విశ్లేషణ :
ఒక మామూలు క్రైమ్ డ్రామాను థ్రిల్లర్గా మలిచిన సంజయ్ గుప్త మంచి విజయం సాధించాడు. ఐదేళ్ల విరామం తరువాత వెండితెర మీద దర్శనమిచ్చిన ఐశ్వర్య తన అద్భుతమైన నటనతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. గ్లామర్ షో కోరుకునే వారిని నిరాశపరిచినా, నటన పరంగా మాత్రం బెస్ట్ అనిపించుకుంది. ఇక ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీలు డైరెక్టర్స్ బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్నారు. అవార్డ్ ఇన్నింగ్ పర్ఫామెన్స్లతో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. అయితే ఫస్టాఫ్ చివరలో వచ్చిన కొన్ని సీన్స్ మాత్రం ఆడియన్స్కు బోర్ కొట్టిస్తాయి. సాంకేతిక విభాగం నుంచి చిన్న చిన్న పొరపాట్లు కనిపించినా జెజ్బా సక్సెస్ ఫుల్ సినిమాగా ఆకట్టుకుంది.


ప్లస్ పాయింట్స్
ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ఖాన్, షబానా అజ్మీల నటన
స్క్రీన్ ప్లే
డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్లో కొన్ని సీన్స్
మ్యూజిక్

ఓవరాల్ గా జెజ్బా ఐశ్వర్యరాయ్కి సక్సెస్ఫుల్ కంబ్యాక్