గుమ్మడికాయ కొట్టేశారు

11 Nov, 2018 05:15 IST|Sakshi
అజిత్‌

ఆ మధ్య అజిత్‌ గుబురు గడ్డంలోనే కనిపించారు. ఇది ఆయన తాజా చిత్రం ‘విశ్వాసం’ కోసమే. కానీ ఇప్పుడు అజిత్‌ క్లీన్‌ షేవ్‌లో కనిపిస్తున్నారు. ఎందుకో ఊహించేయవచ్చు. ‘విశ్వాసం’ షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని ఈ చిత్రనిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్‌ అధికారికంగా ప్రకటించింది. ‘వీరమ్, వేదాలం, వివేగమ్‌’ చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘విశ్వాసం’. ఇటీవల పుణేలో జరిగిన ఫైనల్‌ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను షూట్‌ చేశారు. దీంతో ఈ చిత్రం షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారు అజిత్‌. ఇటీవల రిలీజైన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను గమనిస్తే అజిత్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో యోగిబాబు, ‘రోబో’ శంకర్, తంబి రామయ్య కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్‌ సంగీతం అందించిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు