హీరో అఖిలే లీక్ చేశాడు..?

2 Jul, 2017 10:57 IST|Sakshi
హీరో అఖిలే లీక్ చేశాడు..?

దుబాయ్లోని అబుదాబిలో జరుగుతున్న సైమా వేడుకల్లో యంగ్ హీరో అఖిల్ తొలిసారిగా పాట పాడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన అఖిల్లోని సింగింగ్ టాలెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యారు. అయితే తాజాగా ఈ పర్ఫామెన్స్కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ వార్త టాలీవుడ్ సర్కిల్స్లో సందడి చేస్తుంది.

సైమా వేడుకల్లో అఖిల్ పాడిన పాట తన కొత్త సినిమాలోనిదట. ఏవేవొ కలలు కన్నా అనే పల్లవితో సాగిన మెలోడియస్ సాంగ్, ప్రేక్షకులను కట్టి పడేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం అనూప్ ట్యూన్ చేసిన పాటనే అఖిల్ సైమా స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండగా అఖిల్ పర్ఫామెన్స్ తరువాత ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి.