తెలుగు బ్రదర్స్?

23 Aug, 2015 15:25 IST|Sakshi
తెలుగు బ్రదర్స్?

ఈ నెల 14న విడుదల కానున్న హిందీ చిత్రం ‘బ్రదర్స్’లో అక్షయ్‌కుమార్, సిద్ధార్థ మల్హోత్రా అన్నదమ్ములుగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మితం కానుందనే వార్త హల్ చల్ చేస్తోంది. తెలుగు చిత్రంలో రామ్‌చరణ్, రానా నటించే అవకాశం ఉందట. చరణ్, రానా ఇద్దరూ మంచి స్నేహితులు. ఇక, ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా అంటే.. మంచి కెమిస్ట్రీ పండిస్తారని ఊహించవచ్చు. తమిళ రీమేక్ విషయానికొస్తే.. రియల్ బ్రదర్స్ సూర్య, కార్తీ రీల్ బ్రదర్స్‌గా ఈ చిత్రం రూపొందనుందని టాక్. ఒకవేళ ఈ ఇద్దరూ కాకపోతే.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో విక్రమ్ సోదరుడిగా నటించే అవకాశం ఉందని బోగట్టా. ఇదిలా ఉంటే... హాలీవుడ్ ‘వారియర్’ చిత్రానికి  ఈ ‘బ్రదర్స్’ రీమేక్ . ఈ చిత్రం రిజల్ట్ మీద తెలుగు, తమిళ రీమేక్స్ ఆధారపడి ఉంటాయేమో? ఏదేమైనా.. ఈ రీమేక్ వార్త ఎంతవరకూ నిజమో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.