ఎదురులేని అలెగ్జాండర్ పాటలు

5 Aug, 2013 01:38 IST|Sakshi
ఎదురులేని అలెగ్జాండర్ పాటలు
‘‘మా తాతగారి ట్రైలర్‌తో సినిమా లాంచ్ చేశాం. దర్శకుడు ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. జోశ్యభట్ల మంచి సంగీతాన్నిచ్చారు.’’ అని తారకరత్న అన్నారు. ఆయన హీరోగా పీయల్‌కే రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎదురులేని అలెగ్జాండర్’. ఈ సినిమా పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
 
 దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి పాటల సీడీని ఆవిష్కరించారు. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ‘‘తారకరత్న హీరోగా తొలి సినిమా డెరైక్ట్ చేసింది నేనే. ఈ సినిమా ఘన విజయం సాధించాలి.’’ అన్నారు. 
 
 చాలా మంచి టైటిల్ ఇదని సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. బాలకృష్ణ, ఎన్టీఆర్‌లతో పోటీపడుతూ తారకరత్న ఈ సినిమా బాగా చేశారని ప్రసన్న కుమార్ అన్నారు. కీరవాణి దగ్గర 70 సినిమాలకు, రెహమాన్ దగ్గర 9 సినిమాలకు పనిచేశానని జోశ్యభట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా బసిరెడ్డి, అశోక్ కుమార్, బాపిరాజు, రవీందర్, రమేష్ రెడ్డి తదితరులు మాట్లాడారు.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి