This Week OTT Release Movies: ఈ ఒక్కవారంలో 32 సినిమాలు రిలీజ్.. ఇవి డోంట్ మిస్

10 Dec, 2023 23:39 IST|Sakshi

మరో వారం వచ్చేసింది. మరో 10 రోజుల్లో 'సలార్' మూవీ థియేటర్లలోకి రాబోతుంది. దీంతో ఈ వీక్.. చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. దీంతో ఆటోమేటిక్‌గా మూవీ లవర్స్ దృష్టి ఓటీటీలపై పడుతుంది. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థ రెడీ అయిపోయాయి. అలా ఈ వారం ఏకంగా 32 మూవీస్.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?)

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. కార్తీ 'జపాన్', సల్మాన్ 'టైగర్ 3' చిత్రాలు మాత్రమే అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతావన్నీ కూడా ఇంగ్లీష్, హిందీ సిరీసులు-సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇందులో స్ట్రెయిట్ మూవీస్ ఏం లేనప్పటికీ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ (డిసెంబరు 10 నుంచి 17 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • టైగర్ 3 (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 12
  • డెత్స్ గేమ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 15
  •  రీచర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఫలిమి (మలయాళ మూవీ) - డిసెంబరు 15
  • ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - డిసెంబరు 15

నెట్‌ఫ్లిక్స్

  • జపాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 11
  • కెవిన్ హర్ట్ & క్రిస్ రాక్: హెడ్ లైనర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 12 
  • సింగిల్ ఇన్‌ఫెర్నో సీజన్ 3 (కొరియన్ సిరీస్) - డిసెంబరు 12
  • అండర్ ప్రెజర్: ద యూఎస్ ఉమెన్స్ వరల్డ్‌కప్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 12
  • 1670 (పోలిష్ సిరీస్) - డిసెంబరు 13
  • కార్ మాస్టర్స్ రష్ టూ రిచెస్: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 13
  • ఇఫ్ ఐ వర్ లూయిస్ సోంజా (పోర్చుగీస్ సిరీస్) - డిసెంబరు 13
  • యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2 (టర్కిష్ సిరీస్) - డిసెంబరు 14
  • ద క్రోన్ సీజన్ 6: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 14
  • యూ యూ హకూషో (జపనీస్ సిరీస్) - డిసెంబరు 14
  • క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15
  • చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15
  • ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ (స్పానిష్ సినిమా) - డిసెంబరు 15
  • ఫమిలియా (స్పానిష్ మూవీ) - డిసెంబరు 15
  • ఐ లవ్ లిజీ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 15
  • శేషన్ మైక్-ఇల్ ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 15
  • యో!  క్రిస్మస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 15
  • ద రోప్ కర్స్ 3 (మాండరిన్ మూవీ) - డిసెంబరు 17
  • వివాంట్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 17

జియో సినిమా

  • ద బ్లాకెనింగ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 16
  • ద సోవనీర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 17

లయన్స్ గేట్ ప్లే

  • డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 15

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద ఫ్యామిలీ ప్లాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15

జీ 5

  • కూసే మునిస్వామి వీరప్పన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 14

బుక్ మై షో

  • ద పర్షియన్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 12
  • టేలర్ స్విఫ్ట్-ద ఈరస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 13
  • లైలాస్ బ్రదర్స్ (పర్షియన్ చిత్రం) - డిసెంబరు 15
  • వింటర్ టైడ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 15

(ఇదీ చదవండి: లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్‌ నటుడు, ఫోటోలు వైరల్‌)

>
మరిన్ని వార్తలు