వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

1 Aug, 2019 11:15 IST|Sakshi

బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌ సోదరుడు, మోడల్‌ రాజీవ్‌ సేస్‌ జూన్ 7న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత నిరాడంబరంగా జరిగిన రాజీవ్‌ సేన్‌, చారు అసోపాల వివాహం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఏడాది పాటు ప్రేమలో మునిగితేలిన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలకు మరింత బలాన్నిస్తూ రాజీవ్, చారులు ఒకరి సోషల్‌ మీడియా పేజ్‌లను మరొకరు అన్‌ఫాలో చేయటం చర్చనీయాంశమైంది. అంతేకాదు వారి సోషల్‌ మీడియా పేజ్‌ల ప్రొఫైల్‌ ఫోటోలను కూడా మార్చేశారు. గతంలో ఇద్దరూ కలిసున్న ఫోటోలు ప్రొఫైల్‌ ఫోటోలుగా ఉండగా తరువాత సింగిల్‌గా ఉన్న ఫోటోలను పెట్టారు. దీంతో రాజీవ్‌, చారుల మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలు మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేశాయి.

దీంతో అభిమానులు కామెంట్స్‌ రూపంలో వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రశ్నలకు రాజీవ్‌ సమాధానం చెప్పకపోగా కామెంట్ చేసిన వారిని బ్లాక్‌ చేయటంతో చాలా మంది రాజీవ్‌, చారులు విడిపోయారని నిర్ణయించుకున్నారు. చారు అసోపా కూడా ఈ వార్తలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

అయితే తాజాగా అందరికీ షాక్‌ ఇస్తూ రాజీవ్‌, చారుతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ‘మా తొలి ఢిల్లీ డిన్నర్‌ డేట్‌’ అనే క్యాప్షన్‌తో ఇద్దరు అన్యోన్యంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో ఇన్నాళ్లు ఇద్దరి మధ్య ఏదో జరిగిందంటూ వస్తున్న వార్తలకు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. అంతేకాదు ఒకరి ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ను మరొకరు తిరిగి ఫాలో అవుతున్నారు. అయితే అసలు ఎందుకు అన్‌ఫాలో చేశారు. ఎందుకు తిరిగి ఫాలో చేస్తున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Our first delhi dinner date ❤️ #aboutlastnight #rajakibittu

A post shared by Rajeev Sen (@rajeevsen9) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు