సైరా సెలబ్రేషన్స్‌

5 Oct, 2019 01:10 IST|Sakshi

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాను సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మించారు. ఈ నెల 2న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ  సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేయడానికి అల్లు అరవింద్‌ ‘సైరా’ టీమ్‌కి పార్టీ ఏర్పాటు చేశారు. దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా