అనిల్‌కి అర్జున్‌ ఆఫర్‌!?

25 Oct, 2017 00:15 IST|Sakshi

‘హిట్‌ ఫిల్మ్‌ దర్శకులకు గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌ నుంచి కాల్స్‌ వెళ్లడం కామన్‌!’– ఇదేదో కొత్తగా చెబుతున్నది కాదు. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ ఈ మాట వినిపిస్తుంటుంది. కాల్‌ చేసి మంచి సినిమా తీశావని అభినందిస్తారట. దర్శకుడి స్టైల్‌ నచ్చితే ఆఫర్‌ ఇస్తారట! ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... ‘రాజా ది గ్రేట్‌’ దర్శకుడు అనిల్‌ రావిపూడికి గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌ నుంచి కాల్‌ వెళ్లిందనేది తాజా ఖబర్‌. ‘ఈ కాల్‌ కేవలం అభినందనలకు మాత్రమే పరిమితం కాలేదు, అల్లు అర్జున్‌ కోసం మంచి కథ రెడీ చేసుకో’ అని చెప్పారనేది ఫిల్మ్‌నగర్‌ టాక్‌. కమర్షియాలిటీ అండ్‌ కామెడీ... అనిల్‌ సిన్మాల్లో కంపల్సరీ! మేకింగ్‌ స్టైల్‌ మాంచి స్టైలిష్‌గానూ ఉంటుంది.

 అదే అల్లు అర్జున్‌కి బాగా నచ్చిందట. అందుకే, అనిల్‌ రావిపూడికి ఆఫర్‌ ఇవ్వాలనుకుంటున్నారేమో! మరి, ఈ కాంబినేషన్‌ ఎప్పటికి కుదురుతుందో? ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు అర్జున్‌. అది పూర్తయిన తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో రూపొందే తెలుగు–తమిళ బైలింగ్వల్‌ ఒకటి లైన్‌లో ఉంది!

మరిన్ని వార్తలు