అల్లు పూల్‌

4 Apr, 2019 04:04 IST|Sakshi
అల్లు అయాన్‌, భార్యాపిల్లలతో అల్లు అర్జున్‌

అల్లువారి ఇంట్లో బుధవారం ఆనందం అల్లరి చేసింది. అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ పుట్టినరోజు సందర్భంగానే అల్లువారి ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా. ఈ దంపతులకు అర్హా అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే మనవడి పుట్టినరోజుని అల్లు అరవింద్‌ ఓ స్విమింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘‘నాకు ఎంతో అమూల్యమైనవాడు.

ఐదేళ్ల స్వీట్‌నెస్, చిలిపితనం, క్యూట్‌నెస్‌... అంతులేని ప్రేమ.. అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్‌కు పుట్టినరోజు బహుమతిగా మా నాన్నగారు స్విమ్మింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం ‘నీకు ఏం గిఫ్ట్‌ కావాలి? అని అయాన్‌ను నాన్న అడిగినప్పుడు స్మిమ్మింగ్‌పూల్‌ అని చెప్పాడు. నాన్న ఒప్పుకున్నారు. స్విమ్మింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్‌ అదృష్టం. మా నాలుగో తరం పిల్లలని చూసి నాకు అసూయగా ఉంది. అన్నట్లు.. ఈ స్విమ్మింగ్‌ పూల్‌కు అయాన్‌పూల్‌ అని పేరు పెట్టాం’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. ‘‘అయాన్‌కు ఐదోవ జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు స్నేహా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు