హాలీవుడ్‌ ఎటాక్‌

26 May, 2017 01:28 IST|Sakshi
హాలీవుడ్‌ ఎటాక్‌

చోటు:     షారుక్‌ ఖాన్‌ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు
మోటు:    కాదురా.. టెన్షన్‌తో కొట్టుకుంటున్నాడు.
చోటు:      వాట్స్‌ హిజ్‌ ప్రాబ్లమ్‌?
మోటు:    హాలీవుడ్‌ బాలీవుడ్‌ని ఎటాక్‌ చేస్తుందట.
చోటు:      సినిమా కథలు చెప్పకు.. ఇంకా బలిసి బ్లాస్ట్‌ అవుతావు.
చోటు:     పుల్లలాగా ఉన్నావు. ఒక్కటి పీకానంటే టూ పీస్‌ అవుతావు.
చోటు:     ట్రాక్‌ మార్చకుండా షారుక్‌ ప్రాబ్లమ్‌ ఎంటో చెప్పు.
మోటు:    మనోళ్లకు స్క్రీన్‌ప్లే రైటింగ్‌ రాదట!
చోటు :    వాట్‌?
మోటు:    మార్కెటింగ్‌ రాదట, టెక్నాలజీలో వీక్‌ అట, డిజిటల్‌ వేల్యూస్‌లో జీరో అట.
చోటు :     హవ్వ.. హవ్వ...
మోటు: అమెరికన్‌ హీరో బ్రాడ్‌ పిట్‌ తన డిజిటల్‌ సినిమా ‘వార్‌ మెషీన్‌’ ప్రమోషన్‌కి వచ్చి కొట్టిన కొట్టుడుకి బెంబేలెత్తిపోయి హాలీవుడ్‌ ఎటాక్‌ స్టార్టయ్యింది. వార్‌ వన్‌ సైడ్‌ అయిపోయింది. బాలీవుడ్‌ని క్యాప్చర్‌ చేసేస్తారు అని షారుక్‌ భోరునlఏడుస్తున్నాడు.
చోటు:    ఒకసారి ‘బాహుబలి’ చూడమను... బాలీవుడ్‌ని కాపాడేది టాలీవుడ్‌ అని తెలుస్తుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా