వేడి వేడి పకోడి... భలే టేస్ట్ గురూ!

20 May, 2016 23:06 IST|Sakshi
వేడి వేడి పకోడి... భలే టేస్ట్ గురూ!

‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన.. ఎన్నాళ్లని దాక్కుంటావే పైన’ అంటూ ఎండలకు విసిగిపోయిన ప్రతి ఒక్కరూ ‘వర్షం’లో త్రిష పాడుకున్నట్లుగా పాడుకుంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన వానకు రకుల్ ప్రీత్ సింగ్ ఆ పాటను గుర్తు చేసుకున్నారు. బయట కురుస్తున్న వానను చూస్తూ, వేడి వేడి పకోడీలు లాగించేస్తే ఎంత బాగుండు అనుకున్నారు. పాపం పకోడీలు తయారు చేయడం రాదు కదా. అందుకే తన తల్లిని గుర్తు చేసుకున్నారు. ‘‘మా అమ్మగారు చేసే పకోడీలు భలే టేస్టీగా ఉంటాయి. ప్చ్... ఇప్పుడామె హైదరాబాద్‌లో లేరు’’ అని రకుల్ అన్నారు. వర్షంలో లాంగ్ డ్రైవ్ వెళ్లడం ఇష్టమట. అది తీరే అవకాశం లేదు కాబట్టి జస్ట్ వాన చూస్తూ, ఎంజాయ్ చేసేశానని ఈ బ్యూటీ అన్నారు.