కార్తి హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్న డైరెక్టర్‌

18 Nov, 2023 09:11 IST|Sakshi

త‌మిళంలో కెరీర్ ప్రారంభించిన కార్తి.. కొన్నాళ్ల‌కే  టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో యుగానికొక్క‌డు, నాపేరు శివ,ఊపిరి,సుల్తాన్‌,సర్దార్‌, ఖాకీ, ఖైదీ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో తెలుగువారికి ఆయన ఎంతో దగ్గరయ్యాడు. తాజాగా కార్తి కెరియర్‌లో 25వ సినిమా అయిన జపాన్‌ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో తర్వాతి ప్రాజెక్ట్‌ను ఆయన చాలా జాగ్రత్తగా డీల్‌ చేస్తున్నాడు. 2017లో కార్తి కెరియర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమాగా నిలిచిన ఖాకి చిత్రానికి సీక్వెల్‌ను దర్శకుడు ప్రకటించారు.

1995-2006 మధ్యకాలంలో జరిగిన 'ఆపరేషన్ బవారియా' మిషన్‌ ఆధారంగా ఖాకి సినిమాను తెరకెక్కించారు. తమిళనాడు పోలీసుల నిజ జీవిత ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఖాకీ సినిమా స్క్రీన్ ప్లే ఎడ్జ్ ఆఫ్ యువర్-సీట్ అనేలా ఉంటుంది. సినీ విమర్శకుల నుంచి కూడా ఖాకీ మూవీపై ప్రశంసలు వచ్చాయి. ఖాకి సినిమాకు దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రానికి సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్‌ ఇండస్ట్రీ వర్గాలు  ధృవీకరిస్తున్నాయి.

డైరెక్టర్‌ వినోద్‌ ప్రస్తుతం  కమల్ హాసన్ KH233 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత కార్తితో ఖాకి సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అక్కడి సినీ జర్నలిస్ట్‌లతో వినోద్‌ తెలిపారట. ఈ సినిమా సీక్వెల్ కోసం ఇప్పటికే కథ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. దానిని కార్తికి కూడా చెప్పాడని తెలుస్తోంది. కమల్ హాసన్‌తో తన ప్రస్తుత చిత్రం KH233 పూర్తి చేసిన తర్వాత మాత్రమే తాను ఖాకి- 2 కథను పూర్తి చేస్తానని హెచ్ వినోద్ తెలియజేశాడట. ఈ ఏడాదిలో అజిత్‌తో తెగింపు సినిమాను వినోద్‌ తెరకెక్కించి హిట్‌ కొట్టాడు.

మరిన్ని వార్తలు