బంధువులకు ఆతిథ్యం ఇచ్చిన నటిపై ఫిర్యాదు

23 Apr, 2020 17:39 IST|Sakshi

ముంబై: లాక్‌డౌన్‌లో బంధువులను ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్నారంటూ ప్రముఖ టీవీ నటి అనితా రాజ్‌, ఆమె భర్త సునీల్‌ హింగోరానీలపై వారి పోరుగువారు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో పాలి హిల్స్‌ అపార్టుమెంటులోని అనిత నివాసాన్ని అర్ధరాత్రి పోలీసులు తనిఖీ చేశారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. తన భర్త డాక్టర్‌ అని మెడికల్‌ ఎమర్జేన్సీ రావడంతో ఆయన స్నేహితుడు తన భార్యతో కలిసి వచ్చినట్లు అనిత పోలీసులకు వివరించడంతో వారు వెళ్లిపోయారని తెలిపారు. ‘నా భర్త ఓ డాక్టర్‌. తన స్నేహితులలో ఒకరు మెడికల్‌ ఎమర్జేన్సీ కోసం ఇంటికి వచ్చారు. అతనికి సహాయంగా అతడి భార్య కూడా వచ్చింది. వారి పరిస్థితిని చూసి నా భర్త మానవత్వంతో తిరస్కరించలేకపోయాడు. ఇంట్లోకి పిలిచి వారికి మెడిసిన్‌ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు.
ఆ వీడియో డిలీట్‌ చేసిన హీరో..

ఇక పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు తమపై దాఖలైన తప్పుడు ఫిర్యాదుకు, అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు చెప్పి వెళ్లిపోయారని చెప్పారు. అంతేగాక ప్రస్తుత విపత్కర పరిస్థితులలో పార్టీలకు ఆథిత్యం ఇచ్చి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించనని కూడా తెలిపారు. అయితే పోలీసులు తిరిగి వెళ్లిపోయాక అనితా రాజ్, ఆమె భర్త సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగారని, ఎవరు తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ అర్థరాత్రి బీభత్సం సృష్టించినట్లు సమాచారం. కాగా అనితా ‘24’, ‘చోటీ సర్దార్ణి’ వంటి ప్రముఖ టీవీ సిరీయల్స్‌లో నటించారు. కరోనా ప్రభావిత రాష్ట్రమైన మహరాష్ట్రలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు 6 వేలు  దాటినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్‌ ఔషధం!

>
మరిన్ని వార్తలు