రవితేజ సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్‌

20 May, 2018 12:37 IST|Sakshi

ఈ శుక్రవారం నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమాను ప్రారంభించారు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తుందని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే ఇతర చిత్రాలతో పాటు కుటుంబ సమస్యల కారణంగా అను ఇమ్మాన్యూల్‌ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు కూడా ధృవికరించారు. దాదాపు 50 రోజుల పాటు అమెరికాలో షూటింగ్ చేయాల్సి ఉండటంతో డేట్లు సర్ధుబాటు చేయలేకే అను తప్పుకుంటున్నట్టుగా చిత్రయూనిట్‌ తెలిపారు. దీంతో అను స్థానంలో గోవాబ్యూటీ ఇలియానాను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు