ఏఆర్ రెహ్మాన్ 99 పాటలు

30 Jun, 2015 01:51 IST|Sakshi
ఏఆర్ రెహ్మాన్ 99 పాటలు

 చిత్ర నిర్మాణ రంగంలో కొత్తవారిని ప్రోత్సహిస్తానని ప్రముఖ సంగీత దర్శకు డు ఏఆర్ రెహ్మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు కథను కూడా తయా రు చేస్తున్నట్లు వెల్లడించారు. చాలా కాలం గా ఆ ప్రయత్నాల్లో ఉన్న ఈ ఆస్కార్ అ వార్డు గ్రహీత కృషి ఇప్పటికి కార్యరూపం దాల్చబోతోంది. ఏఆర్ రెహ్మాన్ వైఎంసీ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి తమి ళం, హిందీ భాషలలో తొలి ప్రయత్నంగా ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. సంగీత ప్రధాన కథాంశంతో కూడిన ఈ చిత్రానికి తమిళంలో 99 పాడల్‌గళ్ అని హిందీలో 99 సాంగ్స్ అని పేర్లను నిర్ణయించారు. అంతా కొత్తవారు నటించే ఈ చిత్రానికి రంగస్థల నటుడు, నృత్య కళాకారుడు అయిన విశ్వేశ్ క్రిష్ణమూర్తి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో 10 పాటలు ఉంటాయని సమాచారం. వాటిలో ఇప్పటికే ఏఆర్ రెహ్మాన్ ఐదు పాటలకు కంపోజింగ్ పూర్తి చేశార ట. మిగిలిన ఐదు గీతాల రికార్డింగ్ పూర్తి చేసి షూటింగ్‌కు సిద్ధం కానున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతా న్ని అందిస్తున్నా భవిష్యత్ లో కొత్త సంగీత దర్శకు ల్ని ప్రోత్సహించనున్న ట్లు ఏఆర్.రెహ్మాన్ ఇంత కు ముందే వెల్లడించారన్నది గమనార్హం.