మరో తమిళ సినిమా

4 May, 2020 04:56 IST|Sakshi

‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిహారిక కొణిదెల. ఇప్పుడు మరో తమిళ సినిమా అంగీకరించారు. తమిళ యంగ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌ ముఖ్య పాత్రలో ఓ రొమాంటిక్‌ కామెడీ తెరకెక్కనుంది. స్వాతిని ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇందులో నిహారిక హీరోయిన్‌గా నటించనున్నారు. పూర్తి స్థాయి కామెడీతో ఈ  కథాంశం ఉండబోతోందట.             ‘‘తమిళంలో మరో సినిమా చేయబోతున్నాను. షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు నిహారిక.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా