భళా బాహుబలి

21 Oct, 2019 01:41 IST|Sakshi
చిత్రప్రదర్శన తర్వాత సరదాగా ఫోటో దిగిన ‘బాహుబలి’ బృందం

‘బాహుబలి’ చిత్రం భారతీయ సినిమాలో పెను మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్‌ని విస్తృత పరిచింది.. హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ప్రపంచ వ్యాప్త సినీ ప్రేక్షకులందరితో ‘భళా బాహుబలి’ అనిపించుకుంది. ఇప్పుడు లండన్‌లోనూ ‘భళా బాహుబలి’ అంటూ వినిపిస్తోంది. లండన్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘బాహుబలి: 1’ చిత్రాన్ని హిందీలో ప్రదర్శించారు. 148 ఏళ్ల ఆల్బర్ట్‌ హాల్‌ చరిత్రలో ఇంగ్లీష్‌ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకులందరూ నిల్చొని చప్పట్లు కొట్టారని సమాచారం. ఈ ప్రదర్శనలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. పంచెకట్టు వేషధారణతో రాజమౌళి స్క్రీనింగ్‌కి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు