'హలో చిరు..హలో చిరు హౌ ఆర్ యూ'

30 Nov, 2013 12:55 IST|Sakshi
'హలో చిరు..హలో చిరు హౌ ఆర్ యూ'

ముంబై: జల్సా చిత్రంలోని 'కరో కరో జరా జల్సా' పాటతో పాపులర్ అయిన బాబా సెహగల్.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి ఓ పాటను కానుకగా ఇవ్వనున్నాడు. బాబా సెహగల్ ఇటీవలే చిరంజీవిపై ఓ పాటని రాశాడు. సెహగల్ ఓ స్పెషల్ ట్రీట్ తో అభిమానుల ముందుకు రానున్నాడు. సెహగల్ రాసిన ఆ పాటకి చిరు అని పేరు పెట్టాడని ఆయన తెలిపాడు.

చిరంజీవి గారి కోసం పాట రాస్తున్న విషయాన్ని గతంలో చెప్పిన సెహగల్ తాజాగా ట్రీజర్ ను విడుదల చేశారు. 'హలో చిరు..హలో చిరు హౌ ఆర్ యూ' అంటూ సాగే ఈ పాట త్వరలోనే రిలీజ్ అవుతుందని’ చెప్పాడు. గత కొద్ది రోజుల క్రితమే బాబా సెహగల్ ‘పవ పవ పవన్ కళ్యాణ్’ అంటూ సాగే ఓ పాటని పవన్ కళ్యాణ్ కి ట్రిబ్యూట్ గా చేసారు.  ఆ పాట పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఈ సారి చిరంజీవి కోసం ఎలాంటి పాటతో వస్తున్నాడో వేచి చూడాల్సిందే.